సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. తన కొడుకు తొలి చిత్రం కోసం సుమ కూడా వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
కృష్ణ అండ్ హిస్ లీల ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో బబుల్ గమ్ చిత్రం తెరకెక్కుతోంది. రోషన్ కనకాల డెబ్యూ మూవీ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. సలార్ మూవీ విజృంభిస్తున్న సమయంలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం నుంచి కూడా ఈ మూవీకి పోటీ ఉంది. ఈ తరుణంలో బబుల్ గమ్ పై కాస్త టెన్షన్ నెలకొంది.
అయితే దర్శకుడు రవికాంత్ మాత్రం సూపర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో రవికాంత్ మాట్లాడుతూ ప్రభాస్ సలార్ చిత్రం విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. సలార్ మూవీ థియేటర్స్ లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఎందుకంటే సలార్ మూవీలో లేని కంటెంట్ మా బబుల్ గమ్ లో ఉంది. సినిమా బావుంటే అన్ని చిత్రాలని ఆడియన్స్ ఆదరిస్తారు అని రవికాంత్ అన్నారు. బబుల్ గమ్ కథని కొత్త నటీనటులతో చేయడానికే రాశాను. సుమ గారి కొడుకు రోషన్ హీరోగా లాంచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసి వెళ్లి కలిశాను. ఆ తర్వాత బబుల్ గమ్ జర్నీ మొదలైనట్లు రవికాంత్ అన్నారు
