డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీ విష్ణు ఈ సారి *బ్రోచేవారెవరురా* అనే సినిమాతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. పోస్టర్ - ట్రైలర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ను చూసిన చాలా మంది సోషల్ మీడియాలో పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 

మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగుతుందని ట్విస్ట్ కూడా సినిమాలో మరో హైలెట్ పాయింట్ అని అంటున్నారు. R3 గ్యాంగ్ మెంబర్స్ గా రాహుల్ రామకృష్ణ - శ్రీ విష్ణు - ప్రియదర్శి కడుపుబ్బా నవ్వించినట్లు టాక్ వస్తోంది. అదే విధంగా సత్య దేవ్ - నివేత పేతురేజ్ రోల్స్ కూడా బావున్నాయని శ్రీ విష్ణు - నివేత థామస్ కెమిస్ట్రీ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఫైనల్ గా సినిమా చక్కిలిగింతలు పెట్టె మంచి కామెడీ ఎంటర్టైనర్ అని ఎవరు కూడా మిస్ కావద్దని నెటిజన్స్ అదిరిపోయే రివ్యూలు ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన *బ్రోచేవారెవరురా* సినిమాను విజయ్ కుమార్ మన్యం నిర్మించారు. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు మంచి టాక్ ని రప్పిస్తోంది.