వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న నటుడు శ్రీ విష్ణు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. శ్రీ విష్ణు - నివేత థామస్ జంటగా నటించిన బ్రోచేవారెవరురా అనే సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే ఈ సినిమాకు సంబందించిన ఒక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే సెట్స్ లేకుండా సినిమా షూటింగ్ జరగడం అనేది చాలా కష్టం. కరెక్ట్ అవుట్ ఫుట్ ఎంతవరకు వస్తుందో చెప్పలేము. అయితే బ్రోచేవారెవరురా టీమ్ మాత్రం ముందే అనుకూలమైన లొకేషన్స్ ని సెలెక్ట్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేశారట. 

ఒక్క సీన్ కోసం కూడా చిత్ర యూనిట్ సెట్ వేయలేదట. స్క్రీన్ పై కనిపించేవన్ని రియల్ లొకేషన్స్ అని తెలిపారు. కిడ్నాప్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సత్య దేవ్ - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ వంటి యంగ్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.