Asianet News TeluguAsianet News Telugu

BRO First Look: అదిరిపోయిన `బ్రో` టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌.. పవన్‌ లుక్‌ కేక

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది. టైటిల్‌ని ప్రకటించారు. ముందుగా వినిపిస్తున్నట్టుగానే `బ్రో` టైటిల్‌ని ఖరారు చేశారు.  

bro movie title motion poster released pawan first look keka arj
Author
First Published May 18, 2023, 4:33 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తమిళంలో హిట్‌ అయిన `వినోదయ సీతం` చిత్రానికిది రీమేక్‌. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది. టైటిల్‌ని ప్రకటించారు. ముందుగా వినిపిస్తున్నట్టుగానే `బ్రో` టైటిల్‌ని ఖరారు చేశారు. అయితే ఇంగ్లీష్‌ టైటిల్‌ని నిర్ణయించడం విశేషంగా చెప్పొచ్చు. 

ఇందులో `బ్రో` టైటిల్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో పవన్‌ ఫస్ట్ లుక్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. పవన్‌ మార్క్ స్టయిల్‌లో చేతులు చాచి కిందకి చూస్తూ పవర్‌ఫుల్‌గా ఉన్న ఆ లుక్‌ పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక మోషన్‌ పోస్టర్‌లో బీజీఎం నెక్ట్స్ లెవల్‌లో ఉంది. మోషన్‌ పోస్టర్‌లో కాలం(గడియారం), శివుడి రూపం బ్యాక్‌ డ్రాప్‌లో వస్తుండగా ముందు పవన్‌ చేతులా చాచి తన స్టయిల్‌లో ఉన్నారు. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌లో `కాలః త్రిగుణ సంశ్లేశం, కాలః గమన సంకాశం` అంటూ సాగే పాట పూనకాలు తెప్పించేలా ఉంది.  దీంతో ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ట్రెండింగ్‌ అవుతుంది. ఇది పవన్‌ డేగా మారిపోయింది. 

ఇందులో పవన్‌ దేవుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇక త్రివిక్రమ్‌ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌ మార్క్ స్టయిల్‌లో ఆయన ఈ మోషన్‌ పోస్టర్‌లో బీజీఎం ఇరగొట్టారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ట కో ప్రొడ్యూసర్‌. ఇక ఈ మోషన్‌ పోస్టర్‌ సందర్భంగా సినిమా రిలీజ్‌ డేట్‌ని మరోసారి కన్ఫమ్‌ చేశారు. జులై 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios