Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ఏలో ‘బ్రహ్మస్త్ర’ వసూళ్లు.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కలెక్షన్స్.. ఎంత వచ్చింది?

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఫాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మస్ర్త’ (Brahmastra) నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.  పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే తొలిరోజు ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ ను రాబట్టింది.
 

Brahmastra Movie collections in USA, record level collections in one day.!
Author
First Published Sep 10, 2022, 12:07 PM IST

ఫాంట‌సీ అడ్వేంచ‌ర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  చిత్రం ‘బ్రహ్మస్ర్త’.  బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) మరియు  గ్లామర్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) జంటగా నటించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నిన్న (సెప్టెంబర్ 9న)  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చినా.. ఎక్కువ శాతం ఆడియెన్స్ కు ఫాంటసీ ఫిల్మ్ నచ్చిందనే తెలుస్తోంది. అయితే రిలీజ్ కు ముందే  చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసింది. తాజాగా ఈ చిత్రం యూఎస్ఏలో తొలిరోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం.. యూఎస్ఏలో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. తొలిరోజే 1 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాతో పాటు యూఎస్లోనూ భారీ అంచనాలతో రిలీజ్ కాగా ఫస్ట్ డే సాలిడ్ మార్క్ ను దాటింది. దీంతో మున్ముందు మరింత కలెక్షన్స్ తో కలెక్షన్లలో రికార్డు బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. అంతేకాకుండా ఓవర్సీస్ లోనూ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నే దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇండియాలోనూ తొలిరోజు రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోంది. 

ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ  ఫాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’ను డైరెక్ట్ చేశారు. భారీ విజువల్స్, అదిరిపోయే సీన్స్, వీఎఫ్ఎక్స్, ఎమోషనల్ టచ్ తో ఆడియెన్స్ ను ఫిదా చేశారు. చిత్రంలో రన్బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్,  మౌనీ రాయ్, కింగ్ నాగార్జున, షారుఖ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ బ్యానర్లపై నిర్మాతలు కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్ర, రన్బీర్ కపూర్  దాదాపు రూ.500 కోట్లతో నిర్మించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైమన్ ఫ్రాంగ్లెన్ అందించగా.. ప్రీతమ్ అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios