బాలీవుడ్ హాట్ బ్యూటీగా సన్నీ లియోన్ అక్కడి కుర్ర హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది. చేసేది ఐటెమ్ సాంగ్స్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. సన్నీ స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. 

అసలు విషయంలోకి వెళితే.. సన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఒక సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ సునీల్ - బ్రహ్మానందం కనిపించనున్నారని తెలుస్తోంది. హారర్ అంశాలతో మంచి థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా తెరకెక్కనుందట. ఇంకా టైటిల్ సెట్ చేయలేని ఈ సినిమాకు ప్రసాద్ తాతినేని దర్శకత్వం వహించనున్నాడు.

త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసి షూటింగ్ మొదలుపెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. సన్నీ లియోన్ గతంలో చేసిన హారర్ సినిమాలకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. మరి ఇప్పుడు బ్రహ్మానందం - సునీల్ లతో కలిసి ఆమె ఏ విధంగా అలరిస్తారో చూడాలి.