హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో బ్రహ్మానందం నటించని సినిమా అంటే టాలీవుడ్‌ భూతద్దం పెట్టి వెతికినా దొరికేది కాదు. కానీ కొత్త జనరేషన్ కమెడియన్లు వచ్చిన తరువాత బ్రహ్మీకి అవకాశాలు కాస్త తగ్గాయి. అదే సమయంలో వయో భారం కారణంగా బ్రహ్మానందం కూడా సెలక్టివ్‌గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బ్రహ్మానందం తెర మీద కనిపించే సినిమాలు తగ్గిపోయాయి.

అదే సమయంలో బ్రహ్మానందం ఆరోగ్యం కూడా పాడవ్వటం సర్జరీ కోసం కొంత కాలం సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవటంతో కొంత కాలంగా బ్రహ్మీ సినిమాల్లో కనిపించటం మానేశాడు. కోలుకున్న తరువాత ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా పూర్తి స్థాయి సినిమా చేయలేదు, అయితే ఈ లోగా బ్రహ్మానందం సినిమాలక గుడ్‌ బై చెప్పేస్తున్నాడన్న వార్త వైరల్‌ అయ్యింది.

బ్రహ్మానందం సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడని, సినిమాలకు బదులుగా సీరియల్స్‌లో నటించాలని భావిస్తున్నాడన్న టాక్‌ వినిపించింది. అయితే ఈ విషయంపై బ్రహ్మానందం స్పందించారు, ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చాడు. తాను సీరియల్స్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ అబద్దం అంటూ కొట్టి పారేశాడు బ్రహ్మానందం. ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన బ్రహ్మానందం సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పాడు.