అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరించిన బ్రహ్మాజీ.. కొడుకు సినిమా కోసం తెగింపు.. వీడియో వైరల్
తన కొడుకు సినిమా కోసం ఏకంగా అనిల్ రావిపూడి మెడ మీద కత్తి పెట్టాడు. అంతేకాదు బెదిరింపులకు తెగబడ్డాడు. తన కొడుకు సినిమా `స్లమ్ డాగ్ హజ్బెండ్` మూవీ రిలీజ్ డేట్‌ని చెప్పాలంటూ ఈ దారుణానికి తెగబడటం గమనార్హం.

నటుడు బ్రహ్మాజీ ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది. నవ్వులకు కొదవలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న బ్రహ్మాజీ.. తనలోని మరో యాంగిల్‌ని చూపించాడు. బెదిరింపులకు తెగబడుతున్నాడు. ఏకంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు అనిల్ రావిపూడినే బెదిరించాడు. తన కొడుకు సినిమా కోసం ఏకంగా అనిల్ రావిపూడి మెడ మీద కత్తి పెట్టాడు. అంతేకాదు బెదిరింపులకు తెగబడ్డాడు. తన కొడుకు సినిమా `స్లమ్ డాగ్ హజ్బెండ్` మూవీ రిలీజ్ డేట్‌ని చెప్పాలంటూ ఈ దారుణానికి తెగబడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన `స్లమ్ డాగ్ హజ్బెండ్` చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇతర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో అనిల్ రావిపూడి పాల్గొని తన సపోర్ట్ ని అందించాడు. అయినా వదలకుండా ఇప్పుడు రిలీజ్ డేట్‌ని చెప్పాలని ఒత్తిడి చేశాడు, `భగవంత్ కేసరి` సినిమా షూటింగ్‌లో ఉన్న అనిల్ రావిపూడి వద్దకు వెళ్లి.. రిలీజ్ డేట్ చెప్పాలని రిక్వెస్ట్ చేశాడు. కానీ దర్శకుడు చెప్పను పొమ్మనగా, కత్తి తో బెదిరించాడు బ్రహ్మాజీ. దీంతో ఏం చేయలేక అనిల్ రావిపూడి శనివారం విడుదల కాబోతున్న సినిమాని చూడాలని తెలిపారు. అయితే ఇదంతా జస్ట్ ఫన్, అండ్ ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో కావడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ చేస్తుంది.
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం `స్లమ్ డాగ్ హజ్బెండ్`. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మొదట ఈ నెల 21నే విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాలతో ఈ నెల 29కి మార్చేశారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఫన్నీగా సాగడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మంచి వినోదాన్ని పంచే చిత్రమవుతుంది, కడుపుబ్బా నవ్వుకునే చిత్రమవుతుందని యూనిట్ వెల్లడించింది. ఇందులో హీర సంజయ్ రావు.. కుక్కని పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ వింతైన కాన్సెప్ట్ లోనే బోలెడు ఫన్ ఉంది. సినిమా అంతా ఇలానే ఉంటే ఇది పెద్ద హిట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో బ్రహ్మాజీ కూడా నటిస్తుండటం ఇంకో విశేషం. ఓ రకంగా తండ్రీ కొడుకులు సినిమాలో రచ్చ చేయబోతున్నారని చెప్పొచ్చు.