నెట్‌ఫ్లిక్స్.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అగ్రగామి సంస్థల్లో ఒకటి. ఇటు ఇండియన్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతోపాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా విడుదల చేస్తుంటుంది. ఇందులో బలమైన కంటెంట్‌తో కూడిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు వస్తాయనే పేరుంది. కానీ ఇప్పుడు అనుకోకుండా ఇండియాలో ట్రెండింగ్‌ అవుతుంది. అంతేకాదు విపరీతంగా ట్రోల్‌ అవుతుంది. అందుకు కారణాలు తెలిస్తే షాక్‌ అవుతారు. 

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో  `ఏ సూటబుల్‌ బాయ్‌` వెబ్‌ సిరీస్‌ని వచ్చింది. ఇందులో గుడిలోని ఇద్దరు ప్రేమిచుకులు లిప్‌ కిస్సులు పెట్టుకున్నారు. ఈ సీన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో అది హిందు సాంప్రదాయాలను అవమానించేలా, కల్చర్‌ని, వల్గారిటీగా ఉందని సాంప్రదాయవాదాలు, పలువురు నెటిజన్లు అంటున్నారు. దీంతో ట్రోల్‌ చేస్తున్నారు. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ని బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు `బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్ ఇండియా` యాష్‌ ట్యాగ్‌ పేరుతో ట్రెండ్‌ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ట్విట్టర్‌ని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు.