బోయపాటి నెక్ట్స్ ఏ హీరోతోనో తెలుసా?

బాలయ్యే ముందుకు వచ్చి అఖండ చేస్తున్నారు. ఈ సినిమాకు ఓ రేంజిలో ఊపు వచ్చింది. అఖండ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో  బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాని ఏ హీరోతో చెయ్యబోతున్నాడనేది చర్చనీయాశంగా మారింది. 

Boyapatis proposals to Ravi Teja jsp

కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీస్ కు, మాస్ యాక్షన్ డ్రామాలకు బోయపాటి శ్రీను పెట్టింది పేరు. ఆయన సినిమాలు చూస్తే మాస్ కు పూనకాలు వస్తాయి. ఇంటర్వెల్,క్లైమాక్స్ లలో థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. అయితే ఆయన విన విధేయరామ తర్వాత బాగా వెనకబడ్డారు. దాంతో ఆ తర్వాత ఆయనతో సినిమా చేయటానికి ఏ హీరో ఇంట్రస్ట్ చూపలేదు. మళ్లీ బాలయ్యే ముందుకు వచ్చి అఖండ చేస్తున్నారు. ఈ సినిమాకు ఓ రేంజిలో ఊపు వచ్చింది. అఖండ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో  బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాని ఏ హీరోతో చెయ్యబోతున్నాడనేది చర్చనీయాశంగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు బోయపాటి శ్రీను ..ఇద్దరు హీరోలతో జర్నీ చేస్తున్నారట. ఇద్దరికీ స్టోరీలైన్స్ చెప్పారట. ఆ ఇద్దరూ మరెవరో కాదు అల్లు అర్జున్, రవితేజ. కానీ అల్లు వారబ్బాయి వరస ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇక బోయపాటి చెప్పిన కథకు రవితేజ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే పూర్తి మాస్ స్క్రిప్టుకాకుండా భద్ర టైప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కే ఎక్కవ ప్రయారిటీ ఇస్తూ సీన్స్ చేయమని చెప్పారట.  
 
రవితేజ కోసం ఇప్పటికే బోయపాటి ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును రెడి చేసినట్లు తెలుస్తోంది.   చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. రవితేజ ఖిలాడి విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తోంది. 

ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. నక్కిన త్రినాధ్ రావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట.  దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios