.Disney/Hotstar ఓటిటికు ఈ రైట్స్ ఇవ్వటం జరిగింది. ఇది అసలు రామ్ సినిమాకు ఊహించని ఎమౌంట్. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 

సినిమాకు ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ కాంబినేషన్ ని బట్టి ఒకప్పుడు వచ్చేది. కానీ ఇప్పుడు టీజర్, ట్రైలర్ క్లిక్ అయితే వస్తోంది. తాజాగా స్కంధ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ కానుందని అర్దమవుతోంది. 'తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలి' - అనే డైలాగ్ వైరల్ అవుతోంది! ట్రైలర్ వో హీరో రామ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో చూపించాడు బోయ‌పాటి. ఆడియన్స్ అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంటుంద‌ని ట్రైల‌ర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ సీన్స్‌, రామ్ డైలాగ్‌లు విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం బిజినెస్ ఊపందుకుందని సమాచారం. 

YouTube video player

ముఖ్యంగా ఈ చిత్రం నాన్ థియేటర్ రైట్స్ గురించి అంతటా హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కోసం 45 కోట్ల డీల్ సైన్ చేసారు.Disney/Hotstar ఓటిటికు ఈ రైట్స్ ఇవ్వటం జరిగింది. ఇది అసలు రామ్ సినిమాకు ఊహించని ఎమౌంట్. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ నిమిత్తం మరో 35 కోట్లు వచ్చాయంటున్నారు. డిజిటల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ రైట్స్ కు 5 కోట్లు వచ్చాయని టోటల్ గా నాన్ థియేటర్ రైట్స్ 85 కోట్లు దాకా వెళ్లాయని వినికిడి. 


 శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ (Thaman) సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ బాష‌ల్లో ఈ సినిమా సెప్టెంబ‌ర్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర టీమ్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా మొన్న (ఆగ‌స్టు 26 శ‌నివారం) హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేదిక‌లో ఈ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో హీరోయిన్ . శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.