దర్శకుడు బోయపాటి శ్రీనుపై 'వినయ విధేయ రామ' ఫ్లాప్ ఎఫెక్ట్ బాగా పడింది. మరో బ్లాక్ బస్టర్ సినిమా తీసి తన స్టామినా నిరూపించుకోవాల్సిన అవసరం బోయపాటికి వచ్చింది. ప్రస్తుతం బోయపాటి చేతిలో ఉన్నదిబాలయ్య సినిమా ఒక్కటే.. ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని బోయపాటి భావిస్తున్నాడు. ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు.

అయితేఇప్పుడు బోయపాటికి ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. దీంతో బాలకృష్ణ తన ఫోకస్ మొత్తం ఏపీ ఎలెక్షన్స్ మీదనే పెట్టాడు. ఎన్నికలు పూర్తయ్యే వరకు బాలయ్య సినిమా షూటింగ్ కి రాలేడు. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే లేదా జూన్ లో మొదలుపెట్టాలని చూస్తున్నారు.

ఇప్పటికే బోయపాటి.. బాలయ్యకి కథ చెప్పాడు. ప్రస్తుతం ఆ కథ మీదే వర్క్ చేస్తున్నాడు. ఈ కథలో రాజకీయ అంశాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల్లో టీడీపీ గెలిచి, బాలకృష్ణ కూడా హిందూపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సీన్ రివర్స్ అయితే మాత్రం ఇప్పుడు బోయపాటి సిద్ధం చేస్తోన్న కథను తెరకెక్కించడంలో అర్ధం ఉండదు.

అందుకే ఇప్పుడు బోయపాటి ఆలోచనలో పడ్డాడు. స్క్రిప్ట్ పూర్తైన తరువాత బాలకృష్ణ ఎక్కడ ఈ ప్రాజెక్ట్ వద్దంటారో అని టెన్షన్ పడుతున్నాడట బోయపాటి. ఎన్నికలు పూర్తయ్యే వరకు బోయపాటికి ఈ పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు.