వినయ విధేయ రామ డిజాస్టర్ అయిన నేపధ్యంలో అనేక వివాదాలను ఎదుర్కొంటున్న బోయపాటి మరో ప్రక్క తన తదుపరి చిత్రాలు ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణతో సినిమా ఓకే చేయించుకున్న బోయపాటి ఆ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాదు బాలయ్యతో కాకుండా వేరే యంగ్ హీరోలతోనూ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. దాంతో  రీసెంట్ గా ఓ యంగ్ హీరోని కలిసి స్టోరీ లైన్ వినిపించాడని తెలుస్తోంది. 

ఆ హీరో కూడా వరస ఫ్లాఫ్ ల్లో ఉండటమే కాక యాక్షన్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. బడ్జెట్ కంట్రోల్ లో ఓ సూపర్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి బోయపాటి ఆ కధను రెడీ చేసానని చెప్పారట. ఆ హీరో మరెవరో కాదు అఖిల్ అని తెలుస్తోంది.  బాలయ్యతో సినిమా పూర్తైన వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పారట. 

ఇక బాలయ్యతో చిత్రం విషయానికి వస్తే బోయపాటి స్వయంగా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలుస్తోంది.  అయితే బాలయ్య ఓ కండీషన్ పెట్టి సినిమా ఓకే చేసారట.  ముందు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి తీసుకురావాల‌ని.. ఆ త‌ర్వాత షూటింగ్ చేద్దామ‌ని చెప్పిన‌ట్లుగా వినపడుతోంది.  

అలాగే  'సింహా', 'లెజెండ్' తరువాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించే అవకాశం రకుల్ అందిపుచ్చుకుందని తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్స్ కు స్థానమున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా రకుల్ నటించబోతోందట.