Asianet News TeluguAsianet News Telugu

బోయపాటిని చరణ్ కంట్రోల్ చేస్తున్నాడా..?

ఇప్పుడు రామ్ చరణ్ ఖర్చు విషయంలో బోయపాటికి షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కంటే పది కోట్లు తగ్గించి షూటింగ్ పూర్తి చేయాలని రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. కేవలం చెప్పడం మాత్రమే కాకుండా.. దగ్గరుండి మరీ ఆ వ్యవహారాలు చూస్తున్నాడట

boyapati srinu upset with ram charan

మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు బోయపాటి శ్రీను. స్టార్ హీరోలను పెట్టి భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్ అందుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా వంద రోజులు ఆడడం, భారీగా వసూళ్లు సాధించడంతో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

దీంతో సినిమాపై భారీ ఖర్చు చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్ సీన్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టించాడట బోయపాటి. అయితే సినిమా సగం షూటింగ్ పూర్తయిన తరువాత ఇప్పుడు రామ్ చరణ్ ఖర్చు విషయంలో బోయపాటికి షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కంటే పది కోట్లు తగ్గించి షూటింగ్ పూర్తి చేయాలని రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. కేవలం చెప్పడం మాత్రమే కాకుండా.. దగ్గరుండి మరీ ఆ వ్యవహారాలు చూస్తున్నాడట.

గతంలో బోయపాటి చేసిన జయ జానకి నాయక, లెజెండ్ వంటి సినిమాలకు హిట్ టాక్ వచ్చినా.. నిర్మాతలకు మాత్రం లాభాలు ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే చరణ్ తన సినిమా బడ్జెట్ విషయంలోనే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. బయటకు బోయపాటి.. చరణ్ చెప్పినట్లుగా వింటున్నా.. లోపల మాత్రం అతడిపై గుర్రుగా ఉన్నట్లు టాక్. 

Follow Us:
Download App:
  • android
  • ios