మిస్ చేసుకున్నాను అంటూ బోయపాటి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా?
చివరి 30 నిమిషాల ఎపిసోడ్ స్కంద మూవీకి హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుంది.

బోయపాటి శ్రీను (Boyapati Sreenu) సినిమాలు మాస్ విస్పోటనంలా ఉంటాయి. దర్శకుడుగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన పేరు పోస్టర్ మీద చూసి వెళ్లే వారు ఉన్నారు. ఈ క్రమంలో బోయపాటి, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘స్కంద’ (Skanda). ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, అలాగే రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో బోయపాటి మార్క్ అభిమానులకు తెగ నచ్చేసింది. అంతేకాకుండా అలాగే రామ్ కూడా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సినిమాను వాయిదా వేసారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. అదే పొరపాటు అయ్యిందని బోయపాటి రిగ్రెట్ ఫీలవుతున్నట్లు గా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికి ఈ సినిమాపై సరైన బజ్ లేదు. అలాంటిది ఫెస్టివల్ మూడ్ ని, లాంగ్ వీకెండ్ ని మిస్ చేసుకున్నామే అని డిస్కస్ చేసుకుంటున్నట్లు సమాచారం. రిలీజ్ అయ్యి ..ఓ మాదిరి టాక్ వచ్చినా సరే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20 దాకా ఈ సినిమా కుమ్మేసేది అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు మారిన తేదీతో చంద్రముఖి 2, పెద కాపు చిత్రాల నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందనేది నిజం. పెదకాపు చిత్రం పూర్తి మాస్ లోకి వెళ్లే చిత్రంలా ఉంది. చంద్రముఖి సీక్వెల్ కాబట్టి ఆ సినిమాకు క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలకు మంచి థియేటర్స్ కేటాయిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్కంథ కు దెబ్బ పడుతుందా అని అభిమానులు ఆందోళన పడుతున్నాయి. అయితే బోయపాటి కంటంట్ మీద నమ్మకం ఉన్నవాళ్లు మాత్రం అలాంటిదేమీ జరగదని స్కంద పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారు.
సెప్టెంబర్ 28 ఈ డేట్‌కి వాస్తవానికి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar) చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా నవంబర్ లేదంటే.. రాబోయే సంక్రాంతికి విడుదల అనేలా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ డేట్‌ని ‘స్కంద’కు లాక్ చేశారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి నార్త్‌లో కూడా మంచి హైప్‌తో రిలీజవుతుంది. చివరి 30 నిమిషాల ఎపిసోడ్ స్కంద మూవీకి హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీకి సంబంధించిన థియాట్రికల్, నాన్ థియాట్రికల్ రైట్స్ భారీగానే అమ్ముడుపోయాయని తెలుస్తోంది.