మొన్న సంక్రాంతికి రిలీజైన వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటం బోయపాటికు తిరుగులేని దెబ్బ కొట్టింది. అయితే ఇప్పుడు ఓ పెద్ద హిట్ ఇచ్చి ఆ విషయాన్ని మరిచిపోయేలా చేయాలని బోయపాటి అనుకుంటున్నారు. అందుకు సరైన హీరో బాలయ్యనే అని భావించి...ఆయనతోనే సినిమా చేస్తున్నారు.

అయితే వినయ విధేయ రామ చిత్రానికి ఓవర్ బడ్జెట్ అంటే దాదాపు వందకోట్లు వరకూ ఖర్చు పెట్టారని విమర్శలు ఎదుర్కొన్న బోయపాటి మరోసారి అలాంటి తప్పే చేయబోతున్నాడని టాక్. బాలయ్యతో చేయబోయే చిత్రానికి డబ్బై కోట్లు వరకూ ఖర్చుపెట్టడానికి ఎస్టిమేషన్ వేసారని, అది చూసి టీమ్ కంగారు పడుతున్నారని చెప్తున్నారు. మొన్న ఎన్టీఆర్..కథానాయకుడు చిత్రానికి ఇరవై కోట్లు కూడా వెనక్కి రాకపోవటంతో ఈ బడ్జెట్ ఎక్కువే అంటున్నారు.

మార్కెట్ చూసుకోకుండా వెళ్లిపోతే ఎవరికీ ఏమీ మిగలకుండా పోతోందని ట్రేడ్ లో వ్యాఖ్యానాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువ బడ్జెట్ తో తీసి..దాన్ని మరింత ఎక్కువ రేట్లుకు అమ్మేస్తున్నారు. ఆ తర్వాత సినిమా ఏ మాత్రం కొద్దిగా తేడా అయినా మొత్తం పోతోంది. అదేదో ఎంత మార్కెట్ ఉందో అంచనా వేసుకుని..దానికి తగినట్లు తీస్తే..సినిమా ప్లాఫ్ అయినా పెద్దగా నష్టపోదని అంటున్నారు.

బోయపాటి ఆ విషయం గుర్తిస్తే తమకు రిస్క్ తగ్గుతుందంటున్నారు. అయితే అంత రిస్క్ చేయలేని వాళ్లు బిజినెస్ లోకి రావటం ఎందుకనేది కొందరి ప్రశ్న. బోయపాటి, బాలయ్య కాంబోలో గతంలో సూపర్ హిట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుంది...భారీ రేట్లుకే అమ్ముతారు. కొంటారా లేదా అన్నది డిస్ట్రిబ్యూటర్స్ ఇష్టం.