Asianet News TeluguAsianet News Telugu

టైటిల్ మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వం.. బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌

వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Boya Caste Leaders Demands Chane Valmiki Movie Title
Author
Hyderabad, First Published Sep 16, 2019, 2:30 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'వాల్మీకి' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'వాల్మీకి' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి. వాల్మీకి సినిమా పేరును వెంటనే 
మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో హీరోతో సహా చిత్రబృందం అందరికీ నోటీసులు జారీ చేశారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా.. లక్ష్మణ్ మాట్లాడుతూ.. .. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్‌ స్టర్‌తపోల్చడం వల్ల ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దాంతో వారు తనను సంప్రదించారని.. గ్యాంగ్‌స్టర్‌ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తమ జాతికి  గురువైన వాల్మీకిని ఈ సినిమా ద్వారా రాబోయే తరాలకు గ్యాంగ్‌స్టర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి బోయ ఆరోపించారు.

సినిమా షూటింగ్ మొదలు కాకముందే హరీష్ శంకర్, వరుణ్ తేజ్, నిర్మాతలను కలిసి టైటిల్ మార్చమని కోరామని.. కానీ వారు స్పందించలేదని చెప్పారు. టైటిలే మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వమని వార్నింగ్ ఇచ్చారు. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై నిర్మించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు తెలుగు రీమేక్‌ ఇది. 

Follow Us:
Download App:
  • android
  • ios