ఈ వారంలో చిన్న సినిమాల జోరు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 6:32 PM IST
box office: friday movie releases
Highlights

నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ కూడా ముందుకు వచ్చేశాయి. పైగా ప్రస్తుతం థియేటర్లలో 'గీత గోవిందం' తప్ప మరో హిట్టు సినిమా లేకపోవడం ఈ చిన్న సినిమాలకు కలిసొస్తుంది.

నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ కూడా ముందుకు వచ్చేశాయి. పైగా ప్రస్తుతం థియేటర్లలో 'గీత గోవిందం' తప్ప మరో హిట్టు సినిమా లేకపోవడం ఈ చిన్న సినిమాలకు కలిసొస్తుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే గనుక మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ముందుగా నాగశౌర్య 'నర్తనశాల' ఆగస్టు 30న థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. 'ఛలో' సినిమా హిట్ అవ్వడంతో 'నర్తనశాల'కి మంచి బిజినెస్ అయితే జరిగింది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఆ తరువాత కాస్తో కూస్తో బజ్ ఉన్న సినిమా 'పేపర్ బాయ్'. సంపత్ నంది కథ అందించిన ఈ సినిమా ట్రైలర్ యూత్ ని ఆకట్టుకుంది. డైలాగులు, పాటలు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తునానయి. మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు ట్రైలర్ చూసి మెచ్చుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.

మరో తెలుగు సినిమా సమీరం విడుదలవుతుందని కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ సినిమాలతో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. వాటిలో నయనతార నటించిన 'కోకో కోకిల', అరుణ్ విజయ్ నటించిన క్రైమ్ 23 సినిమాలు ఉన్నాయి. నయనతార సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ వారంలో వస్తోన్న ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అందుకుంటుందో చూడాలి! 

loader