దివంగత సినీ నటి శ్రీదేవికి నివాళిగా  మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ కొద్ది సేప‌టి క్రితం సింగ‌పూర్‌లో శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించింది. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు హాజరయ్యారు.

శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమాలో హవా హవాయి పాటలో శ్రీదేవి లుక్ మాదిరిగా ఈ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. జాన్వీకపూర్ తన తల్లి మైనపు విగ్రహాన్ని చూస్తూ నిల్చుంది.

ఈ విగ్రహం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని చూసిన వారు శ్రీదేవిని నిజంగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు. గ‌తంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఇలా అనేక మంది మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసారు. ఇటీవ‌లే టాలీవుడ్ నుంచి మహేష్, ప్రభాస్ మైన‌పు విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు.

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anand Karapaya (@emceeanandk) on Sep 3, 2019 at 8:45pm PDT