మహేష్ కోసం ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Aug 2018, 5:05 PM IST
bond between mahesh babu, ntr
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. మహేష్, ఎన్టీఆర్, చరణ్ తమ కుటుంబాలతో కలిసి మరీ పార్టీలు చేసుకుంటుంటారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. మహేష్, ఎన్టీఆర్, చరణ్ తమ కుటుంబాలతో కలిసి మరీ పార్టీలు చేసుకుంటుంటారు. త్వరలోనే ఎన్టీఆర్, చరణ్ కలిసి కూడా నటించబోతున్నారు. వీరి ఎంత బాగా ఉన్నప్పటికీ వారి అభిమానుల్లో మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. వీటిని అరికట్టే దిశగా అప్పుడప్పుడు మన స్టార్ హీరోలు సైతం కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ, ఒకరి సినిమాను మరొకరు సపోర్ట్ చేస్తూ అభిమానుల మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ మరొక పెద్ద గొడవ జరగకుండా జాగ్రత్త పడ్డారనే చెప్పాలి.

ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ఓ మోషన్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేశారు. ఆగస్టు 15న టీజర్ విడుదల చేస్తామని గురువారం అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో అభిమానూలు ఎంతగా అడుగుతున్నా చిత్రబృందం మాత్రం నోరు మెదపలేదు. ఓ పక్క మహేష్ బాబు వారం రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే.. ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడి నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం మహేష్ బాబు పుట్టినరోజు నాడు సాయంత్రం మొత్తం హడావిడి అయిన తరువాత గానీ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు రానివ్వలేదు. టీజర్ డేట్ ముందే అనౌన్స్ చేస్తే.. అభిమానులు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తారు. అదే ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటారు. ఈ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలుసు. అందుకే మహేష్ తో పాటు పోటీగా దిగితే ఇరు హీరోల అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తుందని 'మహర్షి' హడావిడి పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తన సినిమా టీజర్ డేట్ అనౌన్స్ చేశారు. అది వారిద్దరి మధ్య ఉన్న అండర్ ష్టాండింగ్. వారి మధ్య ఉన్న స్నేహానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.. 
 

loader