సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ మణిరత్నం తనకు ప్రాణహాని ఉందని పోలీసులను సంప్రదించడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివారాల్లోకి వెళితే.. మణిరత్నం డైరెక్ట్ చేసిన 'నవాబ్' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులో ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడుతున్నప్పటికీ తమిళంలో మాత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తన పవర్ తో సిటీని కంట్రోల్ లో పెట్టుకొని శాసించే వ్యక్తి.. అతడిని అంతం చేసి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూసే కొడుకులు.. రాజకీయాలు,గ్యాంగ్ లు, పోలీసుల నేపధ్యంలో సాగే ఈ సినిమాలో అభ్యంతకర డైలాగులు ఉన్నాయని వాటిని తొలగించమని మణిరత్నంని బెదిరిస్తున్నారట. 

చెన్నైలోని అభిరామపురంలో ఉన్న మణిరత్నం ఆఫీస్ కి కొందరు దుండగులు ఫోన్లు చేసిన ఆయన్ని బెదిరిస్తున్నట్లు మణిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డైలాగులు తొలగించకపోతే బాంబ్ వేస్తామని ఫోన్లోనే బెదిరించడంతో మణిరత్నం పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.