పుష్ప2 విషయంలో ఇంతకు మించి చూపించాలనిచూస్తున్నారట టీమ్. అంతే కాదు జాగ్రత్తగా అడుగులువేస్తూ..పుష్ప సినిమాకు డబుల్ రెస్పాన్స్ ను రాబట్టాలి అని ఫిక్స్అయ్యారట.
పుష్ప సినిమా సక్సెసో లో.. ఐటమ్ సాంగ్ పాత్రఎంత ఉందో అందరికి తెలిసిందే..? ఈసాంగ్ ఎంతలా ఆడియన్స్ పై ప్రభావం చూపిందో కూడా తెలిసిందే. సమంత స్టార్ డమ్ తో పాటు.. ఆమె పెర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. పాటకు బ్రహ్మరథం పట్టారు. దాంతో పుష్ప2 విషయంలో కూడా ఇంతకు మించి చూపించాలనిచూస్తున్నారట టీమ్. అంతే కాదు జాగ్రత్తగా అడుగులువేస్తూ..పుష్ప సినిమాకు డబుల్ రెస్పాన్స్ ను రాబట్టాలి అని ఫిక్స్అయ్యారట.
పుష్ప సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 సినిమాపై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న బన్నీ అమ్మవారి వేషంలో ఉన్న పోస్టర్ రిలీజ్ చేయడంతో.. ఆ అంచనాలు కాస్తా డబుల్ అయ్యాయి. అందుకే పుష్ప-2 మూవీ విషయంలో సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
పుష్ప సీక్వెల్ విషయంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు.. ఇక పుష్ప2లో కూడా ఐటమ్ సాంగ్ ఉంటుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మూవీ టీమ్ అప్పుడప్పుడు హింట్స్ కూడా ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ పెట్టిన ఒక పోస్ట్ మరోసారి పుష్ప2 ఐటమ్ సాంగ్ పై ఆడియన్స్ లో ఆశలు రేపుతోంది. అల్లు అర్జున్ కు టైట్ హగ్ ఇచ్చింది బ్యూటీ.. ఆ ఫొటోని సీరత్ కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్టే చేసింది. దానికి క్యాప్షన్ గా డాన్సర్స్ కి ఎగిరేందుకు రెక్కలు అక్కర్లేదు.. వారి ఎనర్జీనే లీడ్ చేస్తుంది అంటూ రాసుకొచ్చింది చిన్నది.
ఈ పోస్ట్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఐటమ్ సాంగ్ అంటూ రచ్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 తప్ప మరే సినిమా చేయడం లేదు. సీరత్ కపూర్ కి కూడా టాలీవుడ్ లో సినిమాలు ఏమీ లేవు. దాంతో జానాలకు అక్కడ లింక్ బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో కరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. దాంతో సీరత్ కపూర్ పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే కన్ ఫర్మేషన్ కు వచ్చేస్తున్నారు ఆడియన్స్.
అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటీ అంటే.. ఆమెపెట్టిన ఈ పోస్ట్ ద్వారా.. ఈ సినిమాలో సీరత్ సాంగ్ చేస్తోంది.. అని చెప్పడానికి లేదు. ఎందుకంటే.. ఈమధ్య సినిమాలతో పాటు యాడ్స్ కూడా గట్టిగా చేస్తున్నాడు బన్నీ. అందులో భాగంగా ఇదిజరిగి ఉండవచ్చు కదా అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కువగా ఎండార్స్ మెంట్లు కూడా చేస్తుంటాడు. ఒకవేళ ఈ డాన్స్ అందుకోసం కూడా కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
