మాస్టర్ సినిమాతో తమిళ నాట క్రేజీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ - లోకేష్ కనగరాజ్. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మరో క్రేజీ మూవీ లియో. ఈసినిమాకు సబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు టీమ్.
దళపతి విజయ్ హీరోగా.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా లియో. ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 19న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అందుకే ఈసినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు టీమ్. ఇప్పటికే విజయ్ నాన్ స్టాప్ గా ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటుననారు. ఇక ఈసినిమాకు సంబంధించిన మెయిన్ లీడ్ కాస్టింగ్ అంతా ఒక్కొక్కరుగా సినిమాలో జాయిన్ అవుతున్నారు. ఇక ఈసినిమా నుంచి రీసెంట్ గారిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో లియో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇప్పటికే లియో సినిమాకు కావల్సినంత బజ్ క్రియేట్ అయ్యింది. కమల్ హాసన్ కు కు విక్రమ్ సినిమాతో కెరీర్ లో నే బిగ్గెస్ట్ హిట్ అందించిన లోకేష్ కనకరాజ్.. అదే ఊపులో విజయ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెట్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అడుగుపెట్టాడు. లియో సినిమాలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సంజయ్ సెట్ లోకి అడుగు పెట్టిన ఫోటోలు.. వీడియోలు మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలోనే సంజయ్ దత్ ఈసినిమాలో నటిస్తున్నట్టు మూవీ టీమ్ అనౌన్స్ చేయడంతో పాటు.. ఆయన లుక్‌ను వదిలారు. దాంతో ఈ లుక్ కు ఆడయిన్స నుంచి మంచి స్పందన వచ్చింది. అటు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా స్వయంగా సంజయ్‌దత్ రోల్ సినిమాకి కీలకం కాబోతున్నట్టు తెలిపారు. ఇక మాస్టర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి.
సోలో హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతుందనుకున్న టైమ్ లో త్రిషకు హీరోయిన్‌గా ఈసినిమాలో మంచి అవకాశం వచ్చింది. ఈసినిమాలో విజయ్ సరసన సందడి చేయబోతుంది స్టార్ హీరోయిన్. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.లలిత్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో లియోను తెరకెక్కిస్తున్నాడు.
