టాలీవుడ్ స్టార్ హీరో..గ్లోబల్ స్టార్..  రామ్ చరణ్  ఎంత పెద్ద స్టారో అందరికి తెలుసు.. అంతటిపెద్ద స్టార్ మరో స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పాడంటేనమ్ముతారా..? నమ్మలేకపోయినా.. ఇది నిజం. ఇంతకీ ఎవరా స్టార్ హీరో...? 

స్టార్ హీరోలు ఎవరి సినిమాలకు వాళ్లు డబ్బింగ్ చెప్పుుకుంటారు. ఇక కొంత మంది స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు చేసేప్పుడు తెలుగుతో పాటు.. వాళ్లకు తెలిసిన తమిళ్,కన్నడ భాషయలకు కూడా డబ్బింగ్ చెపుతుంటారు. కాని తెలుగులో రిలీజ్ అయ్యే హిందీ, తమిళ స్టార్ హీరోల సినిమాలకు మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్ లు చెపుతుంటారు. 

వేరే భాషల్లో సినిమా డబ్ అయినప్పుడు .. వాళ్ళకి ఆ భాష రాకపోయినా.. వాళ్ళ వాయిస్ ఆ భాషకి సెట్ అవ్వదు అనుకున్న అంత సునాయాసంగా.. ఆ భాష మేము మాట్లాడలేము.. సినిమా దెబ్బ అయిపోతుంది అన్న భయం ఉన్న.. ఆ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు మేకర్స్ . ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరో – హీరోయిన్ల విషయంలో జరుగుతుంది .

ఒక స్టార్ హీరోకి మరో హీరో డబ్బింగ్ చెప్పడం అనేది చాలా అరుదు.. అది మన తెలుగులో అలాంటివి చాలా రేర్ గా జరుగుతుంటాయి. .. ఒక హీరోయిన్ కి మరొక హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం ఇండస్ట్రీలో సర్వసాధారణం . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా..గా ఉన్న ఒక స్టార్ కు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. అవును వింటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. 


ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అవును మన సల్లూ భాయ్ కి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. కాని ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. .ఇంతకీ ఆ సినిమా మరేదో కాడు.. ప్రేమ్ రతన్ కి ధన్ పాయో” . ఈ సినిమా తెలుగులో డబ్బైంది. అయితే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కోసం రామ్ చరణ్ తన వాయిస్ ని హెల్ప్ చేశాడు . భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ సినిమా ని చేశాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ విషయం చాలా తక్కువ మందికే తెలిసింది.

అయితే ఈ విషయం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవ్వడం కాదు..మెగా ఫాన్స్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . రామ్ చరణ్ అంత పెద్ద స్టార్ అయినా.. ఏమాత్రం తక్కువ ఫీల్ అవ్వకుండా ఇలా సల్మాన్ కు డబ్బింగ్ చెప్పాడు అని చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఇది చివరిదశ షూటింగ్ లో ఉంది. ఈసినిమా తరువాత బుచ్చిబాబు సానతో మరోపాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు రామ్ చరణ్.