సెప్టెంబర్ నెలలో మనీ లాండరింగ్ ఆరోపణలపై పరాగ్ ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన ఇల్లు, క్లబ్. ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. పరాగ్ దాదాపు 15 ఏళ్లుగా బాలీవుడ్ పరిశ్రమతో సంబంధాలు కలిగి ఉన్నారు. నిర్మాతగా, ఫైనాన్సర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు.

బాలీవుడ్ నిర్మాత పరాగ్ సంఘ్వి (Parag Sanghvi)అరెస్ట్ అయ్యారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(EOW ) సోమవారం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ముంబై పోలీసుల సమాచారం ప్రకారం ఒక ఫ్రాడ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు.  డిసెంబర్ 24 వరకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కస్టడిలో కోర్టు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. 

సెప్టెంబర్ నెలలో మనీ లాండరింగ్ ఆరోపణలపై పరాగ్ ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన ఇల్లు, క్లబ్. ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. పరాగ్ దాదాపు 15 ఏళ్లుగా బాలీవుడ్ పరిశ్రమతో సంబంధాలు కలిగి ఉన్నారు. నిర్మాతగా, ఫైనాన్సర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. 'అబ్ తక్ చప్పన్ 1 & 2, 'వాస్తు శాస్త్రం', 'ఢర్నా మనా హై', 'ఢర్నా జరూరీ హై', 'గోల్‌మాల్-ఫన్ అన్‌లిమిటెడ్', 'ఏక్ హసీనా థీ', 'నాచ్' తో పాటు మరెన్నో చిత్రాలతో ఆయన ప్రత్యేకంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారు.

Also read మీ వెనుక వెంకన్న దేవుడుంటే.. నా వెనుక సుకుమార్ ఉన్నాడు
రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma)దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు, సర్కారు 3, ది అటాక్స్ ఆఫ్ 26/11 చిత్రాల నిర్మాణంలో పరాగ్ కీలక పాత్ర వహించారు. వర్మకు పరాగ్ అత్యంత సన్నిహితుడు. వీరిద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది. 2020లో పరాగ్ రెండు బడా ప్రాజెక్ట్స్ కోసం ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో చేతులు కలిపాడు. ఈ ప్రాజెక్ట్స్ వివరాలు ఇంకా బయటికి రాలేదు. పరాగ్ ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన ఆర్థిక నేరాలపై విచారణ చేపడుతున్నారు. 

Also readRajamouli Tweets: ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు అడ్డుతప్పుకున్నందుకు రాజమౌళి థ్యాంక్స్.. ఎవరెవరికి చెప్పాడంటే..?