Asianet News TeluguAsianet News Telugu

మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలీవుడ్ స్టార్? అప్పుడు బాలయ్యకు నో చెప్పిన ఆ హీరో ఎవరంటే?

నందమూరి బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ని అనుకుంటున్నారట. కాగా ఈ హీరో గతంలో బాలయ్య సినిమాకు నో చెప్పాడట.. 
 

bollywood star in balakrishna son mokshagna debut movie key details ksr
Author
First Published Aug 21, 2024, 7:14 AM IST | Last Updated Aug 21, 2024, 7:14 AM IST

నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైంది. మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు దగ్గరపడుతున్నాడు. బాలకృష్ణ బాల్యంలోనే నటుడిగా మారాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పసిప్రాయంలోనే రాముడు వంటి ఐకానిక్ రోల్ చేశాడు. 20 ఏళ్లకే మాస్ హీరోగా ఎదిగిన అరుదైన నటుడు జూనియర్ ఎన్టీఆర్. మోక్షజ్ఞ మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నాడు. 2024లో మాత్రం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పై ప్రకటన ఉంటుందని విశ్వసనీయ సమాచారం. 

గతంలో షేప్ అవుట్ బాడీలో కనిపించి షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ... మేకోవర్ అయ్యాడు. స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఇక మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలయ్య అప్పజెప్పాడు. కథ కూడా లాక్ చేశారు. మూవీ సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుందట. 

మరి పాన్ ఇండియా చిత్రం అంటే కీలక పాత్రల కోసం వివిధ పరిశ్రమలకు చెందిన నటులను తీసుకోవడం పరిపాటి. అది ఇతర మార్కెట్స్ లో సినిమా బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో ఓ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ని అనుకుంటున్నారట. ఆయనెవరో కాదు అమితాబ్ బచ్చన్. కథలో కీలకమైన పాత్రకు అమితాబ్ చక్కగా సరిపోతాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. త్వరలో ఆయన్ని సంప్రదించనున్నారట. bollywood star in balakrishna son mokshagna debut movie key details ksr

కాగా గతంలో అమితాబ్ బాలయ్య మూవీని తిరస్కరించారట. దర్శకుడు కృష్ణవంశీ బాలకృష్ణ-అమితాబ్ కాంబోలో ఓ చిత్రం అనుకున్నారట. ఇతర కారణాలతో అమితాబ్ ఈ ప్రాజెక్ట్ సున్నితంగా తిరస్కరించాడట. అమితాబ్ తిరస్కరించడం వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. అప్పుడు బాలయ్యకు నో చెప్పిన అమితాబ్ ఇప్పుడు మోక్షజ్ఞతో స్క్రీన్ షేర్ చేసుకుంటారో లేదో చూడాలి. 

ఈ చిత్రంలో మోక్షజ్ఞకు జంటగా శ్రీలీల నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బాలయ్య-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అభిమానులు రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సక్సెస్ కావడం చాలా అవసరం. జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుతూ మోక్షజ్ఞను ట్రోల్ చేసే ప్రమాదం లేకపోలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios