ఎంతటి స్టార్లు అయినా.. కొంత మంది  కొన్ని విషయాల్లో.. సామాన్యుల మాదిరితగ్గి ఉంటారు.. ఆడియన్స్ మనసు దోచుకుంటుంటారు..  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా.. అలానే అభిమానుల మనసు దోచింది. ఇంతకీ ఆమె ఏం చేసిదంటే.. ? 

ఎంతటి స్టార్లు అయినా.. కొంత మంది కొన్ని విషయాల్లో.. సామాన్యుల మాదిరితగ్గి ఉంటారు.. ఆడియన్స్ మనసు దోచుకుంటుంటారు.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా.. అలానే అభిమానుల మనసు దోచింది. ఇంతకీ ఆమె ఏం చేసిదంటే.. ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ అలియా భట్. RRR తో టాలీవుడ్ ఆడియన్స్ మనసుదోచిన ఈ బ్యూటీ.. ఈసిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. బ్రహ్మాస్త్ర సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో.. ఈసినిమాతో మన హీరోయిన్ అనిపించుకుంది బ్యూటీ.. ఆతరువాత రణ్ బీర్ ను పెళ్ళాడు.. ప్రెగ్నస్నీతో.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీ.. పాపకు జన్మనిచ్చి ఆమె బాగోగులు చూసుకుంటోంది. 

పాప బాగోగులు చూసుకుంటూనే.. అటు అవార్డ్ ఫక్షన్స్ కు తిరుగుతూ. . సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో సందడి చేసింది బ్యూటీ. తాజాగా ఈ భామ.. మళ్ళీ ఇప్పుడు తిరిగి షూటింగ్స్ లో పాల్గొనబోతుంది. అయితే ఆల్రెడీ ఆలియా నటించిన రెండు సినిమాలు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలొ వాటిలో ఒకటి హాలీవుడ్ మూవీ, మరొకటి బాలీవుడ్ మూవీ. ఇది ఇలా ఉంటే, తాజాగా అలియాకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Scroll to load tweet…

ముంబైలోని ఒక ఏరియాకి వచ్చిన అలియాని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహపడ్డారు. అలియా కూడా వారి కోసం కొన్ని ఫోటోలు ఇచ్చింది. అయితే ఫోటోలు తీసే కంగారులో ఒక ఫోటోగ్రాఫర్ చెప్పు కాలు నుంచి జారిపడిపోయింది.ఇక అది చూసిన అలియా.. ఆ చెప్పని తన చేతితో తీసి అతడి దగ్గరికి తీసుకువెళ్లి ఇచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

ఒక స్టార్ నటి.. అందులోను బాలీవుడ్ స్టార్.. అంత ఇమేజ్ ఉన్న ఆలియా భట్ ఇలా చేయడం గ్రేట్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఆలియాను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.