క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి అక్షయ్ కుమార్ ప్రత్యేక పూజలు, ఉజ్జయినిలో బాలీవుడ్ హీరో బర్త్ డే వేడుకలు
బాలీవుడ్ స్టార్ సీనియార్ హీరో అక్షయ్ కుమార్ ఉజ్జయిని సందర్శించారు. అక్కడ కొలువై ఉన్న మహాకాళేశ్వర్ ను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అక్షయ్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ లో మంచి మనసున్న హీరోగా.. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఫస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు అక్షయ్ కుమార్. ఆయన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండటంతో పాటు. సమాజసేవలు చేయడం.. ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం లాంటివి కూడాచేస్తుంటారు. తాజాగా అక్షయ్ కుమార్ ఉజ్జయిని సందర్శించారు. అక్కడ కొలువై ఉన్న మహాకాళేశ్వర్ ను దర్శించుకున్నారు. అక్షయ్ పుట్టిన రోజు సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే విశేషం ఏంటంటే.. అక్షయ్ తో పాటు ఆయన కుమారుడు ఆరవ్, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఆయన వెంట ఉన్నారు.
అక్షయ్ కుమార్ తన 56 వ పుట్టినరోజు సందర్భంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి.. ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన వెంట సోదరి, మేనల్లుడు కుమారుడు ఆరవ్, క్రికెట్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు. వీరంతా భస్మ హారతికి హాజరైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీమహాకాల్ లోక్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ప్రత్యేకంగా కనిపనిస్తున్నారు. కాషాయ బట్టల్లో..అక్షయ్ కుమర్ పక్కా క్లాసికల్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్షయ్ కుమార్ సినిమా ‘మిషన్ రాణిగంజ్’ రెస్క్యూ థ్రిల్లర్‌గా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌లో మునుపెన్నడు లేని విధంగా అక్షయ్ కనిపించారు. ఈ సినిమా ‘రాణిగంజ్ కోల్ ఫీల్డ్’లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. భారత్ బొగ్గు గని రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించిన దివంగత శ్రీ జస్వంత్ సింగ్ గిల్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్, వరుణ్ బడోలా, దిబ్యేందు భట్టాచార్య, రాజేష్ శర్మ, వీరేంద్ర సక్సేనా నటించిన ‘మిషన్ రాణిగంజ్’ అక్టోబర్ 6, 2023 న థియేటర్లలోకి రాబోతోంది.