పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. తారక్ లో సరికొత్త కోణాన్ని చూపించిన ఆ సినిమాను ఇతర ఇండస్ట్రీల వారు తెగ ఇష్టపడ్డారు. అయితే బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్ సింబా పేరుతో రానున్నాడు. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. 

కథ దాదాపు ఒకటే అయినా దర్శకుడు రోహిత్ శెట్టి బాలీవుడ్ మాసాలని బాగానే కలిపాడు. టెంపర్ కి పెద్దగా మ్యాచ్ కాలేదు. అయితే ఎన్టీఆర్ తరువాత సినిమాలో మేజర్ రోల్ అయినా పోసాని చేసిన పాత్రను ట్రైలర్ అయితే పెద్దగా చూపించలేదు. రన్ వీర్ నెగిటివ్ పాత్రలను చేయడంలో కింగ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రను బాగానే ఎలివేట్ చేసినట్లు అర్ధమవుతోంది. 

క్లైమాక్స్ ట్విస్ట్ లో మార్పులు ఉండవు గాని నార్త్ జనాలకు నచ్చే విధంగా దర్శకుడు సీన్స్ ను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమాలో విలన్ గా సోనూసూద్ నటిస్తుండగా హీరోయిన్ గా సారా అలీ ఖాన్ నటిస్తోంది. ఇక సినిమాను డిసెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. పెళ్లి తరువాత రన్ వీర్ సింగ్ నుంచి వస్తోన్న మొదటి సినిమా ఇదే.