వైవిధ్యమైన కతలకు ప్రాధాన్యత ఇచ్చే యంగ్  హీరోల్లో సుప్రీమ్ హీరో సాయితేజ్ ముందు ఉంటారు. ఈ మధ్యకాలంలో సాయి నుంచి వచ్చిన ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస సక్సెస్ లే అందుకు సాక్ష్యం.  ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘రిప‌బ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటిక‌ల్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ‘రిప‌బ్లిక్‌’ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. 

ఇప్పటికే విడుద‌ల చేసిన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సిన పరిస్దితి కనపడుతోంది. అందుకు కారణం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్. 

బాలీవుడ్ ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చేస్తున్న తాజా చిత్రం 83. ఈ సినిమాను భారత సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం రణ్‌వీర్ క్రికెట్ శిక్షణ తీసుకున్నారు. కపిల్ దేవ్ స్పెషల్ షాట్లను అచ్చం అలానే కొట్టాలని ఎంతగానో శ్రమించారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూన్4న ప్రేక్షకుల ముందుకు వస్తుందంట. 

అంతేకాకుండా ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ దర్శకత్వంలో దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, సాజిద్ నడియాద్వాలా, విష్ణువర్థన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. 

ఇప్పుడీ సినిమా రిపబ్లిక్ రిలీజ్ రోజునే రిలీజ్ అయితే పెద్ద సమస్య వస్తుంది. మాగ్డిమం మల్టిప్లెక్స్ లు రణ్ వీర్ సింగ్ సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. హైదరాబాద్ వంటి సిటీలలో ఈ సినిమానే మొదట చూడాలని జనం ఆసక్తి చూపిస్తారు. అప్పుడు ఖచ్చితంగా రిపబ్లిక్ సినిమా కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయం ఇప్పుడు సాయి తేజ నిర్మాతలు గమనించాల్సిన విషయం.  మే 28న బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా బీబీ3, రవితేజ నటించిన ‘ఖిలాడి’ విడుదల కానున్నాయి.