Asianet News TeluguAsianet News Telugu

చీపురుపట్టి.. ఆలయాన్ని శుభ్రం చేసిన బాలీవుడ్ హీరో.. దాదాపై ప్రశంసల వర్షం...

బాలీవుడ్ లో ఆయన ఓ దాదా.. ఆయనతో మాట్లాడాలి అంటే భయపడతారు.. సెట్ లో ఆయన ఉంటే వాతావరణం కామ్ గా ఉంటుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా దాదాగా పేరుగాంచిన జాకీ ష్రాఫ్ చీపురు పట్టారు.. గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. 
 

Bollywood Senior Hero Dada Jackie Shroff Takes Cleanliness  Of Oldest Ram Temple In Mumbai JMS
Author
First Published Jan 17, 2024, 7:40 PM IST

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ చీపురు పట్టారు. ఓఆలయాన్ని తన భార్యతోకలిసి..తానే స్యయంగా శుభ్రం చేశారు. అంతే కాదు..అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సతీ సమేతంగా ఆహ్యానం కూడా అందుకున్నారు జాకీభాయ్.  అయోధ్య రామాలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ట ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న జరిగే బాల రాముడి  ప్రతిష్ఠా వేడుక కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూతి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని చూడటం కోసం దేశ విదేశాల నుంచి అతిధులు రాబోతున్నారు. మహా సాధువులు, పండితులతో పాటు.. సినీరాజకీయక్రీడా  రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లు కూడా  అయోధ్యకు తరలి రానున్నారు. అయితే ఈ అద్భుత  ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే వివిధ భాషల్లో స్టార్లుగా వెలుగు వెలుగుతున్న వారందరికి వరుసగా ఆహా్వానాలు అందాయి. 

తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ వంటి సూపర్‌ స్టార్స్‌ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందగా.. వారు హాజరుకానున్నారు. అలాగే బాలీవుడ్‌  నుంచి కూడా స్టార్ నటీనటులకు కూడా ఆహ్వానాలు అందాయి.. ఇంకా కొంత మందికి అందుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే అనుష్కశర్మ దంపతులతో పాటు.. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ దంపతులకు రామ మందిరి ఆహ్వానం అందింది. 

ఈ సందర్భంగా జాకీ భాయ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరలవుతోంది.ప్రముఖ హిందీ నటుడిగా ఎంతో స్టార్ డమ్ ఉన్న  జాకీ ష్రాఫ్‌ తన సింప్లిసిటీని చాటుకున్నారు. సెలబ్రిటీ అన్న స్టేటస్‌ను పక్కన పెట్టి రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేశారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో పురాతన రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి క్లీనింగ్‌ స్టాఫ్‌తో కలిసి రామాలయ ప్రాంగణం, మెట్లను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇక ఈ వీడియో చూసి..ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడంతో పాటు.. తమ అభిమాన తార చేస్తున్న పనికి ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు. నెటిజన్లు జాకీష్రాఫ్‌ చేసిన పనిని రకరకాల కామెంట్లతో పొగిడేస్తున్నారు. జాకీష్రాఫ్‌ సమాజంలో ఇంకా ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిరుపేద చిన్నారుల వైద్యం కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు జాకీభాయ్. ఇక ఈ స్టార్ నటుడు సౌత్ ఆడియన్స్ కు ముఖ్యంగా  తెలుగు వారికి కూడా సుపరిచితమే. పవన్‌ కల్యాణ్‌ పంజా, ఎన్టీఆర్‌ శక్తి, ప్రభాస్ సాహో, అస్త్రం, బ్యాంక్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ తదితర సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. తమిళ, మలయాళ భాషల్లోనూ  జాకీ ష్రాఫ్ నటించి మెప్పించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios