సల్మాన్ ఖాన్ అబద్దాలకోరు, మోసగాడు అంటున్న బాలీవుడ్ హీరో.. ఎవరతను..?
సల్మాన్ ఖాన్ ను ప్రాణంతా ప్రేమించేవారు ఉన్నారు ఇండస్ట్రీలో.. కాని ఆయనో అబద్దాలకోరు, ఆయనో మోసగాడు అని అంటున్నాడు మరో బాలీవుడ్ సీనియర్ మాజీ హీరో. ఇంతకీ ఏంటా కథ.
సల్మాన్ ఖాన్ ను ప్రాణంతా ప్రేమించేవారు ఉన్నారు ఇండస్ట్రీలో.. కాని ఆయనో అబద్దాలకోరు, ఆయనో మోసగాడు అని అంటున్నాడు మరో బాలీవుడ్ సీనియర్ మాజీ హీరో. ఇంతకీ ఏంటా కథ.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ ను ప్రేమించేవారు దేశమంతా ఉన్నారు. అయితే ఆయన్ను వ్యతిరేకించేవారు కూడా అంతే మంది ఉన్నారు. అంతే కాదు సల్మాన్ ను చంపుతామంటూ.. కొంత మంది పబ్లిక్ గానే వార్నింగ్ లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. దాంతో ప్రభుత్వంతో పాటు.. సల్మాన్ సొంత సెక్యూరిటీ కూడా ఆయన్ను కంటికి రెప్పలా రక్షిస్తూ వస్తున్నారు.
అయితే ఇండస్ట్రీలో కూడా సల్మాన్ అంటే గిట్టని వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సల్మాన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన ఒక మాజీ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ను అబద్దాలకోరు అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ అవుతున్న ఈ కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కుచ్ కుచ్ హోతా హై సినిమా గురించి మాట్లాడుతూ, ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అబద్దాలు చెప్తాడని, మోసం చేస్తాడని మాజీ హీరో చంద్రచూడ్ చెప్పుకొచ్చారు
కుచ్ కుచ్ హోతా హై’ సినిమా విడుదలై 25 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ గతంలో చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్ అయ్యాయి. ఆ రోజు సల్మాన్ ఖాన్ మాటలపై బాలీవుడ్ మాజీ నటుడు చంద్రచూర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ అబద్దాలకోరు అని అన్నాడు. ఇంతకీ గతంలో సల్మాన్ అన్న మాటలు ఏంటీ అని అంతా అనకుంటున్నారు.
గతంలో కాఫీ విత్ కరణ్‌పై మాట్లాడిన సల్మాన్ ఖాన్.. కుచ్ కుచ్ హోతా హై సినిమాలో అమన్ పాత్రలో నటించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కొంతమంది మాటలు విని కరణ్ జోహార్ నా దగ్గరకు వచ్చారు. నేను సైఫ్‌ను అడిగాను, చంద్రచూడ్ సింగ్ ను అడిగాను. కానీ వాళ్ళు నాతో సినిమా చేయనున్నారు అని చెప్పారు అని కరణ్ చెప్పాడని అన్నారు సల్మాన్. కరణ్ టాలెంట్‌పై నాకు నమ్మకం ఉండడంతో అమన్ పాత్రలో నటించేందుకు అంగీకరించాను అని సల్మాన్ ఖాన్ అన్నారు. దాంతో ఈ విషయంలో చంద్రచూడ్ స్పందించారు.. సల్మాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.