Asianet News TeluguAsianet News Telugu

#మీటూ: ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్యాంట్ జిప్ తీసి.. వేధించాడు!

#మీటూ ఎఫెక్ట్ ఇప్పుడు మాములుగా లేదు. హాలీవుడ్ లో కూడా వైరల్ అవ్వనంతంగా ఈ ఉద్యమం ఇండియా ఫిల్మ్ ఇండుస్త్రీలను షేక్ చేస్తోంది. బడా స్టార్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.

bollywood music dairecter harresment issue viral
Author
Hyderabad, First Published Oct 21, 2018, 2:11 PM IST

#మీటూ ఎఫెక్ట్ ఇప్పుడు మాములుగా లేదు. హాలీవుడ్ లో కూడా వైరల్ అవ్వనంతంగా ఈ ఉద్యమం ఇండియా ఫిల్మ్ ఇండుస్త్రీలను షేక్ చేస్తోంది. బడా స్టార్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే #మీటూ పై కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 

ఇక మరో మ్యూజిక్ డైరెక్టర్ పై ప్రస్తుతం ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.  అను మాలిక్ పై సింగర్స్ సోనా మహాపాత్ర - శ్వేత పండిత్ లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మరొక మహిళ తన పేరు చెప్పకుండా మాలిక్ నుంచి ఎదురైనా చేదు అనుభవాన్ని మీడియాకు తెలిపింది.

1990లో మెహబూబా స్టూడియోలో అను మాలిక్ ను కలువగా అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు నేను ఆగ్రహం వ్యక్తం చేయడంతో సారి చెప్పాడు. ఇక కొన్ని రోజుల తరువాత ఇంటికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే నాకు అర్థమైంది. 

ఇంట్లో ఎవరూలేరు. అను మాలిక్ తీరుపై నాకు అనుమానం కలిగింది. అతను అప్పుడే నన్ను వేధించాడు. ప్యాంట్ జిప్ తీసి.. నా స్కర్ట్ ను పైకి ఎత్తే ప్రయత్నం చేశాడు. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. అదృష్టవశాత్తు అప్పుడు నేను బయటపడ్డా. ఆ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని అప్పట్లో అతను బెదిరించినట్లు ఆ మహిళ వివరణ ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios