Asianet News TeluguAsianet News Telugu

400 కోట్లకు దివంగత నటుడు దేవానంద్ ఇల్లు, భారీ ధరకు బాలీవుడ్ నటుడి ఇల్లు అమ్మకం..?

ఇండియన్ మూవీ హిస్టరీలో  లెజండరీ నటుడిగా వెలుగు వెలిగారు  దేవానంద్. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా కాలం అవుతుంది. ఇక రీసెంట్ గా ఆయన నివసించిన ఇంటిని భారీ ధరకు విక్రయించినట్టు తెలుస్తోంది. 
 

Bollywood legendary Star actor dev anand mumbai House sold for 400 Cr JMS
Author
First Published Sep 21, 2023, 4:28 PM IST

ఇండియన్ మూవీ హిస్టరీలో  లెజండరీ నటుడిగా వెలుగు వెలిగారు  దేవానంద్. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా కాలం అవుతుంది. ఇక రీసెంట్ గా ఆయన నివసించిన ఇంటిని భారీ ధరకు విక్రయించినట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ ను ఏలిని హీరోలలో దేవానంద్ ఒకరు.  హీరోగానే కాకుండా రచయితగా దర్శకుడిగా నిర్మాతగా బాలీవుడ్ కు సేవలు అందించిన దేవానంద్.. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణమైన నటనకు పెట్టింది పేరుగా నిలిచారు.  ఆయన కొన్నేళ్ల పాటు అగ్ర హీరోగా వెలుగు వెలిగారు.   బాలీవుడ్‌ ను కింగ్ లాగా  ఏలారు. అతని స్టైల్, చార్మింగ్ పేస్, డైలాగ్ డెలివరీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

ఇప్పటి హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. అప్పటి తరం యూత్  లో దేవానంద్  స్వాగ్ గట్టిగా నడిచింది. ఆయన స్టైల్ ను బాగా అనుకరించేవారు. ఇక ఆయన మరణించి పదేళ్లకుపైనే అయినా.. తాజాగా  ఇప్పుడు ముంబైలోని ఆయన ఇంటిని భారీ మొత్తానికి విక్రయించినట్లు న్యూస్ వైరల్ అవుతోంది.  

1950స్ నుండి 1970స్ ప్రారంభం వరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటులలో  దేవానంద్ ఉన్నారు. ఆయనే టాప్ లో ఉన్నారు. అంతే కాదు ఆయన చేతినిండా సంపాదించి..  ముంబైలో వేల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. హిందీ చిత్రసీమలో తన సంపాదనలో చాలా వరకు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో దేవ్ ఒకరని అంటుంటారు. ఆయన తదనంతరం ఆస్తులన్నీ ఫ్యామిలీకి చెందాయి. ఆ ప్రాపర్టీలలో ముంబైలోని జుహులోని ఫేమస్ బంగ్లా కూడా ఉంది. దాన్ని రీసెంట్ గా ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ 400 కోట్ల కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది. 

ముంబై - జుహులోని  అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్నదేవానంద్ ఇంటిని అమ్మడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ ఇంటి అమ్మకంలో.. డీల్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. తాజాగా ఈ విక్రయానికి సబంధించిన అన్ని పనులు పూర్తయినట్టు తెలుస్తోంది.  దేవ్ బంగ్లాని 400 కోట్లకు ఓ రియలెస్టేట్ ఓనర్ కొనుగోలు చేసినట్టు సమాచారం.  అంతేకాదు ఆ బంగ్లా ప్లేస్ లో భారీ భవంతి కట్టబోతున్నట్టు సమాచారం.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం  ముంబై జుహూ అత్యంత ఖ‌రీదైన‌ ఏరియా కావడంతో అన్ని కోట్ల ధర పలికిందని.. ఆ బంగ్లా ప్లేసులో   22 అంతస్తుల టవర్‌ ను నిర్మించాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందులో నిజా నిజాలు తెలియవు కాని.. సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ వైరల్ అవుతోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios