సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది బాలయ్య బాబి సినిమా షూటింగ్. తాజాగా  ఈ షూటింగ్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. సెట్స్ అంతా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతకీ సందర్భం ఏంటంటే..? 

బాలకృష్ణ NBK109 సెట్స్ లో సెలబ్రేషన్స్ జరిగాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ, హీరోగా ఊర్వశి రౌటేలా జంటగా.. యండ్ టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో.. NBK 109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య బాబు ఎలక్షన్ వర్క్స్ లో బిజీగా ఉండటంతో.. షూటింగ్స్ కు లాంగ్ గ్యాప్ ను ప్రకటించారు. దాంతో బాలయ్య లేని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు దర్శకుడు బాబి. బాలకృష్ణ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉండేలా ప్లాన్ చేస్తుకుంటున్నారు. 

కాగా ఈమూవీ సెట్స్ లో సెలబ్రేషన్స్ జరిగాయి. హీరోయిన్ ఊర్వశి రౌటేలా బర్త్ డే కావడంతో.. షూటింగ్ స్పాట్ లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. షూటింగ్ అనంతరం NBK 109 టీమ్ స్పెషల్ గా తెప్పించిన కేక్ ని కట్ చేసిన ఊర్వశి, తన బర్త్ డే ఇంత బాగా సెబ్రేట్ చేసిన యూనిట్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన బర్త్ డే కేక్ కటింగ్ కి సంబందించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు ఊర్వశి. 

View post on Instagram

కాగా ఆ వీడియోలో దర్శకుడు బాబీ సందడి చేశారు కేక్ తినమంటే ఆయన సిగ్గుపడుతూ.. కొంచెం కొంచెంగా కొరుక్కుతినడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈవీడియో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.