Asianet News TeluguAsianet News Telugu

ముంబయ్ మెట్రోలో సందడి చేసిన సారా అలీఖాన్, లగ్జరీ కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో సెలబ్రిటీలు

ఈమధ్య ఎక్కువగా ఫిల్మ్  సెలబ్రిటీలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ప్రేమను పెంచుకుంటున్నారు.  సాధారణ జనాల్లాగే బస్సుల్లో, ట్రైన్స్ లో, ఆటోల్లో వెళుతూ సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా ఇలాగే మెట్రోలో వెళ్ళింది. 

Bollywood Heroine sara alikhan travelled in mumbai metro JMS
Author
First Published Apr 27, 2023, 9:43 AM IST

లగ్జరీ కారుల్లో తిరిగి బొర్ కొట్టిందనుకుంటా..బాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీలు ఈమధ్య పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై.. ప్రేమను పెంచుకుంటున్నారు. సాధారణ జనాల్లో కలిసిపోయి.. వారితోసరదాగా గడుపుతూ.. ప్రయాణాలు చేస్తున్నారు. ఆమధ్య బాలీవుడ్ డ్రీమ్ గర్ల్.. అలనాటి అందాల తార హేమా మాలిని.. మోట్రోతో పాటు.. ఆలోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇలానే.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ కూడా మెట్రోలో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. 

సెలబ్రిటీలు బయట కనిపిస్తే..సాధారణ వ్యాక్తులకు పండగే.. ఫోటోలు, సెల్ఫీలుఅంటూ సందడి చేస్తారు.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ మెట్రోలో సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్.  వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే ఓ సినిమా చేస్తోంది సారా. ఆదిత్య రాయ్ కపూర్ తో జంటగా ఈ సినిమాలో నటిస్తోంది. అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న  ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. 

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సారా అలీఖాన్ ఈసినిమా  షూటింగ్ కు ముంబైలో మెట్రోలో వెళ్ళింది. సారా మెట్రోలో వెళ్తున్నప్పుడు తీసిన ఓ చిన్న వీడియో క్లిప్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆ వీడియో షేర్ చేసి.. నేను మీకంటే ముందే మెట్రోలో ఉన్నాను అంటూ డైరెక్టర్ అనురాగ్ బసు, హీరో ఆదిత్య రాయ్ కపూర్ ని ట్యాగ్ చేసింది. తన సినిమా షూటింగ్ కు కారులో వెళ్లకుండా.. మెట్రోలో వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది సారా. 

ఈ వీడియో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సారా అలీ సింప్లిసిటీని కొంత మంది మెచ్చుకుంటున్నారు. మెట్రో బ్యాక్ గ్రౌండ్ లో సినిమా తెరకెక్కుతుండటంతో... ఈమూవీ షూటింగ్ దశలో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. అందులో బాగంగానే ఇలా సారా అలీఖాన్ మెట్రోలో ప్రయాణించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక సారా షూటింగ్ కి మెట్రోలో వెళ్లడంతో మెట్రోలో ఉన్న సాధారణ ప్రజలు ఆశ్చర్యపోయారు. సారాతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. సారా మెట్రోలో వెళ్లిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios