చాలా మంది సినీ తారలు చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు తమ లుక్ మార్చుకుని వచ్చారు. సినిమా అంటే గ్లామర్ ఫీల్డ్ కనుక ఇక్కడ అందంగా కనిపించాయి. అందుకు తగ్గట్లుగా ఫిట్ గా ఉండాలి. కొందరు హీరోయిన్లు టీనేజ్ నుంచే అందంగా కనిపిస్తారు. గతంలో ఏమాత్రం ఆకర్షణీయంగా లేరు అని విమర్శలు ఎదుర్కొన్న హీరోయిన్లే ప్రస్తుతం గ్లామర్ తో అదరగొడుతున్నారు. 

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ని చూడగానే గుర్తుపట్టడం కష్టం. ప్రస్తుతం ఈ భామేఫ్యూచర్ బాలీవుడ్ క్వీన్ అని ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు.. సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి సారా అలీఖాన్. గత ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ తన అందం, చలాకీతనంతో అందరిని మాయ చేసింది. 

సారా తప్పనిసరిగా స్టార్ హీరోయిన్ అవుతుందంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే.. ఇది సారా కాలేజ్ డేస్ లోనిది. ఆ సమయంలో సారా అలీఖాన్ దాదాపు 90 కేజీలకు పైగా బరువు ఉండేదట. ఈ విషయాన్ని సారా పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. 

నటనపై ఆసక్తి ఉందని ఇంట్లో చెప్పినప్పుడు.. ముందు నువ్వు లావు తగ్గాకే సినిమాల గురించి ఆలోచించు అని ఆమె తల్లి అమృతా సింగ్ కండిషన్ పెట్టిందట. ఆ సమయంలో ఫిజిక్ పై దృష్టి పెట్టి ప్రస్తుతం ఉన్న లుక్ సాధించానని సారా తెలిపింది. తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ సారా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Throw🔙 to when I couldn’t be thrown🔙☠️🙌🏻🎃🐷🦍🍔🍕🍩🥤↩️ #beautyinblack

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Sep 4, 2019 at 1:54am PDT