రిలీజ్ కు రెడీ అవుతోంది పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ. వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు టీమ్. ఈసందర్భంగా ముంబయ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో.. ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది.
తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్-2. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈనెల 28న రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఈక్రమంలో సినమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.ఈసారి ప్రమోషన్స్ చాలా లేట్ గా స్టార్ట్ చేశారు పొన్నియిన్ టీమ్. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈసినిమా తమిళనాట భారీగా ప్రమోట్ చేస్తున్నారు తప్పించి.. ఇతర భాషల్లో మాత్రం పెద్దగా హడావిడి లేదు. రీసెంట్ గా తెలుగు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి.. ప్రీ రిలీజ్ ను కాస్త గ్రాండ్ గా చేశారు కాని.. ముఖ్య అతిథులు మాత్రం ఎవరూరాలేదు.
ఇక ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పొన్నియిన్ టీమ్.. వరుస ప్రమోషన్‌లతో తెగ బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా ముంబైలో ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి అందరిని ఆకర్షించింది. ఈసినిమాలో... నటించిన మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. మణిరత్నం ఐశ్వర్యా రాయ్ నటన గురించి వరుసగా ప్రశంసలు కురిపించడం.. ఆమె టాలెంట్ ను గురించి మాట్లాడటంతో.. ఐశ్వర్య వెంటనే వెళ్ళి మణిరత్నం కాళ్ళకు నమస్కరించింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్య పజువూరు యువరాణి నందిని పాత్రలో నటించింది. ఇక సెకండ్ పార్ట్‌లో ఐశ్వర్య పాత్ర కీలకమని తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ మణిరత్నం దర్శకత్వంలోనే జరిగింది. ఆయన డైరెక్ట్ చేసిన ఇద్దరు సినిమాతోనే ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు ఆమెకు తిరుగులేని పాపులారిటీ కూడా ఆయన వల్లే వచ్చింది. వీరిద్దరి కాంబోలో.. గురు, విలన్, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలు వచ్చాయి.
ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 సంచలనం సృష్టించిందింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాదు తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు కూడా తీసుకొచ్చింది. అయితే తమిళంలో తప్ప మిగితా భాషల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ఈసినిమా. తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కించడంతో.. ఈమూవీ తమిళులకు తప్పించి ఇతరులకు ఎక్కలేదు. ఇక ఈమూవీ సీక్వెల్ పై తమిళనాట క్రేజ్ భారీగా స్థాయిలో పెరిగింది. ఇక ఇప్పటికే బుకింగ్స్ ఓపెనవగా.. టిక్కెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
