రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. అది కూడా సెంటిమెంటల్ గా ఆలోచించింది అనుష్క. 

పెళ్లి తరువాత వెండి తెరకు దూరం అయ్యింది బాలీవుడ్ భామ అనుష్క శ‌ర్మ.పెళ్ల‌యిన త‌ర్వాత షూటింగ్‌కు దాదాపు దూర‌మైంది. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉండగానే క్రికెటర్ వీరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుష్క. అంతకు ముందు కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరు పెద్దవాళ్లను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్శికి ముందు.. పెళ్ళి తరువాత విరాట్ ఆడే ప్రతీ మ్యాచ్ కు దాదాపు అనుష్క శర్మ హాజరయ్యేది. 

ఇక 2021 జ‌న‌వ‌రిలో అనుష్క పండ‌టి పాపాయికి జ‌న్మ‌నించింది. ఆ పాప‌కు వామికా కోహ్లీగా పేరు కూడా చేశారు. కూతురు పుట్టి ఏడాది దాటి పోతుంది. అనుష్క‌ పెళ్లి, పిల్ల‌ల కార‌ణంగా సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూర‌మై దాదాపు 3 ఏళ్ళకు పైనే అవుతుంది. ఇక ఇప్పుడు అనుష్క గ్రాండ్ క‌మ్ బ్యాక్ కు రెడీ అవుతోంది.

Scroll to load tweet…

జుల‌న్ గోస్వామి బ‌యోపిక్ మూవీ చ‌క్‌డా ఎక్స్‌ప్రెస్ తో వెండితెరపై మ‌ళ్లీ సందడి చేయబోతోంది అనుష్క శర్మ. ఈ సినిమాతో తన అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈసినిమాలో క్రికెట‌ర్ పాత్రలో అనుష్క నటిస్తుండటంతో.. దీని కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తుంది. గ‌త కొన్ని రోజులుగా అనుష్క క్రికెట్ లో ట్రైనింగ్ తీసుకుంటోంది. గ్రౌండ్ లో చెమటోడుస్తోంది. 

రీసెంట్ గా ఆమె క్రికెట్ మైదానంలోకి దిగిబ్యాట్ ప‌ట్టుకుని క్రికెట్ ఆడుతున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అంతే కాదు ప్రాక్టీస్ కు సంబంధించిన ఫోటోస్ ను కూడా ఆమె తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేసింది.