Asianet News TeluguAsianet News Telugu

ఇల్లు అద్దెకు ఇచ్చేసిన సల్మాన్ ఖాన్, రెంట్ ఎంత వసూలు చేస్తున్నాడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఇంటిని రెంటుకు ఇచ్చాడట. ముంబయ్ లో అతి కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఇంటిని రెంటుకు ఇచ్చిన ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా..? 
 

Bollywood Hero Salman khan given his Home for rent In Mumbai JMS
Author
First Published Sep 29, 2023, 4:26 PM IST

సినిమా సెలబ్రిటీలు ఒక్క సినిమాలనే నమ్ముకోవడం లేదు. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఇటు సినిమాలు చేస్తూనే.. అటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్లు వెనకేస్తున్నారు. ఇవి కాకుండా .. బిజినెస్ లు చేస్తున్నారు. శేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారు. ప్రాపర్టీస్ కట్టి రెంట్ కు ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఒక్క ఇండస్ట్రీ అని లేదు అన్ని భాషల్లో సినిమా వాళ్ళకు ఏదో ఒక రకంగా సంపాద ఉంటోంది. ఇక ఈక్రమంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బాలీవుడ్ లో బాగా సంపాదిస్తున్న సెలబ్రిటీలలో  సల్మాన్ ఒకరు. అంతే కాదుఇండియా అంతా ఉన్న సెలబ్రిటీలలో, అత్యంత సంపన్నులలో కూడా సల్మాన్ ఖాన్ ఒకరు.  సల్మాన్ ఖాన్ లగ్జరీ లైఫ్, ఆయన ఫామ్ హౌస్, పార్టీలు, కార్లు, దాంతో పాటు ప్రస్తుతం ప్రమాధంలో ఉన్న ఆయనకు.. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీతో పాటు.. సల్మాన్ సొంత సెక్యూరిటీ.. ఇలా అన్నింటికి కలిపి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందే. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్  విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో భారీగా  ఆస్తులను కూడా కలిగి ఉన్నారు. 

అయితే రీసెంట్ గా సల్మాన్ ఖాన్  తనకున్నఅపార్ట్మెంట్స్ లో ఒకదానిని రెంట్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. సల్మాన్ ఖాన్ ముంబైలోని శాంతాక్రజ్‌లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీలో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. దానికి సంబంధించిన రెంట్ అగ్రిమెంట్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. లాస్ట్ మన్త్ అంటే అగస్టు నుండి 60 నెలల టైమ్ డ్యూరేషన్ లో ఈ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం,భవనంలోని కింది అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు.. రెండవ అంతస్తులను సల్మాన్  కలిగి ఉన్నారు.  నివేదికల ప్రకారం మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ. 1 కోటికి చేరుకుంటుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షలకు పెరుగుతుందని అంచనా.

మూడవ సంవత్సరం రూ. 1.05 కోట్లు, నాలుగు మరియు ఐదవ సంవత్సరానికి వరుసగా రూ. 1.10 కోట్లు, రూ. 1.15 కోట్లు. సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని శివ్ అస్థాన్ హైట్స్‌లో నెలకు రూ. 95,000 చొప్పున మరో అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చాడని సమాచారం. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ముంబయ్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios