సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉండటం.. లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన బద్రతపై మరింత దృష్టి పెట్టారు.  


బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు వరుస బెదిరింపులు.. స్టార్ హీరోపై హత్యయత్నం తో.. అలర్ట్ అయ్యారు స్టార్ హీరో. ఇప్పటికే ప్రభుత్వం నుంచి సల్మాన్ కు సెక్యూరిటీ అందగా... ఆయన కూడా తన సొంత సెక్యూరిటీని పెంచుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆయన మరింత పటిస్ట బద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక హై ఎండ్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఎస్‌యూవీని సల్మాన్‌ కొనుగోలు చేశాడు. పూర్తిగా బుల్లెట్‌ ప్రూఫ్‌ అయిన నిస్సన్‌ పెట్రోల్‌ ఎస్‌యూవీ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో ఈ కారును నిస్సన్‌ కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. దక్షిణాసియా మార్కెట్‌లో మోస్ట్‌ పాపుల్‌ ఎస్‌యూవీ అయిన ఈ కారు..చాలా ఖరీదు ఉంటుంది. 

గత నెల 19న ఈ కడల వీరునికి గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఈ-మెయిల్‌ బెదిరింపులు వచ్చాయి. దీంతో తన స్వీయ భద్రతపై దృష్టిసారించాడుక సల్మాన్. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర ముంబై పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులు, దాదాపు 10 మంది కానిస్టేబుళ్లు రోజు షిప్ట్ వైజ్ గా.. సల్మాన్ ఇంటిదగ్గర విధుల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. బాంద్రాలోని సల్మాన్‌ ఇంటితో పాటు.. ఆఫీస్‌ పరిసరాలలో కూడా సెక్యూరిటీ టైట్ చేశారు. అంతే కాదు అభిమానులు ఒకే చోట గుమ్మికూడకుండా జాత్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇక సల్మాన్ ను లారెన్స్ బిష్షోయ్ గ్యాంగ్ చంపుతామని బెదిరించడంతో .. పలువరిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే గ్యాంగ్‌స్టర్‌ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారికాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఆ వన్యప్రాణులను వేటాడం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్‌ దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. తమ కులదైవానికి మెక్కి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.