బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్ బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీమేక్ సినిమాలపై పెదవి విరిచారు రణ్ బీర్. తాను రీమేక్ సినిమాలు ఎందుకు చేయను అనే విషయాన్ని కూడా వెల్లడించారు రణ్ బీర్


బాలీవుడ్ లో రొమాంటికి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు యంగ్ స్టార్ రణ్ బీర్ కపూర్. కపూర్ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా సినిమా ల్లోకి వచ్చినా..తనకంటూ సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నారు రణ్ బీర్. ఈక్రమంలో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన ప్లే బాయ్ ఇమేజ్ తోఉన్నాడు. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమ కలాపాలు నడిపి హాట్ టాపిక్ అయ్యారు. బ్రేకప్ లతో కాంట్రవర్సీ హీరోగా కూడా మారాడు. చివరకు ఆలియా భట్ తో సహజీవనం చేస్తూ.. రీసెంట్ గా పెళ్ళి చేసుకుని..ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. 

పెళ్ళి పిల్లల తరువాత కూడా రణ్ బీర్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా తగ్గలేదు. సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగామాట్లాడే రణ్ బీర్ కపూర్.. రీసెంట్ గా రీమేక్ మూవీస్ పై స్పందించారు. రీమేక్‌ సినిమాల పట్ల తన అయిష్టాన్ని వ్యక్తం చేశారు రణ్‌బీర్‌ కపూర్‌. ఒక భాషలోసూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ ఇంకో భాషలో రీమేక్ చేయడంలో అర్ధం లేదనన్నారు. 

రీమేక్ మూవీస్ ట్రెండ్ పై రణ్ బీర్ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాదు ఆడియన్స్ లో కూడా ఆసక్తికరంగా మారాయి. రణ్‌బీర్‌ మాట్లాడుతూ…రీమేక్‌ సినిమాలకు, పాటలకు నేను వ్యతిరేకం అన్నారు.ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ తెరకెక్కించడం... కొత్తగా ఏముంటుంది. ఏ కొత్తదనం పంచుతుంది. ఏమాత్రం కొత్తగా అనిపించని రీమేక్ సినిమాలు ఆడియన్స్ కు ఎందుకు ఇష్టం ఉంటాయి అన్నారు రణ్ బీర్. 

అంతే కాదు ఒక కథను సాధ్యమైనంత సృజనాత్మకంగా రూపొందించిన తర్వాత మరోసారి ఆ కథలో ఆకట్టుకునే అంశంఏముంటుంది. హీరోగా ఒక కొత్త కథను ప్రేక్షకుల దగ్గరకు తీసుకొచ్చే స్థాయిలో నేనున్నాను. అదే ప్రయత్నాన్ని చేస్తా. నా కెరీర్‌ స్టార్టింగ్ లో బచ్నా ఏ హసీనో సినిమాలో ఓ పాటను రీమిక్స్‌ చేశాను. అప్పుడు దర్శకులకు వద్దని చెప్పేంత ధైర్యం నాలో ఉండేది కాదు.. కాని ఇప్పుడు చెపుతున్నా... రీమేక్ కథలు కాని. రీమేక్ పాటలు కాని..రీమేక్ సినిమాల జోలికి నేను పోనూ అన్నారు రణ్ బీర్.