Asianet News TeluguAsianet News Telugu

ముంబయ్ రోడ్లపై సైకిల్ సవారీ చేస్తోన్న రణ్ బీర్ కపూర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ముంబయ్ రోడ్లపై సైకిల్ పై షికారు చేస్తున్నాడు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్. బయటకు రావాలంటే సెలబ్రిటీలు బయటపడే ఈరోజుల్లో.. కూల్ గా.. కామ్ గా సైకిల్ పై దర్జాగా బయటకు బయలుదేరాడు రణ్ బీర్. 
 

bollywood hero ranbir kapoor e-bike ride in mumbai
Author
First Published Nov 29, 2022, 5:39 PM IST

ముంబయ్ రోడ్లపై సైకిల్ పై షికారు చేస్తున్నాడు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్. బయటకు రావాలంటే సెలబ్రిటీలు బయటపడే ఈరోజుల్లో.. కూల్ గా.. కామ్ గా సైకిల్ పై దర్జాగా బయటకు బయలుదేరాడు రణ్ బీర్. 

సినిమావాళ్ళకు రోడ్డుమీద తిరిగే అదృష్టం ఉండదు. ఏ సైకిల్ మీదతో... బైక్ మీదనో షికారు చేసే ఛాన్స్ అస్సలు ఉండదు. అందుకే ఎప్పుడైనా అర్ధరాత్రుల్లో కార్లు వేసుకుని అలా తిరుగుతుంటారు స్టార్ సెలబ్రిటీలు. ఒక వేళ పగటిపూట ఏ సెలబ్రిటీ అయినా బయటకు వస్తే.. ఇక అయిపోయినట్టే.. జనాలను ఆపడం ఎవ్వరివల్లాకాదు. అటు సెలబ్రిటీ సెక్యూరిటీ కూడా కష్టం అవుతుంటుంది. అందుకే స్టార్స్ కూడా అంత త్వరగా బయటకు రారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్.. అలా ముంబయ్ వీధుల్లో సందడి చేసి అందరికి షాక్ ఇచ్చారు. 

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబయి వీధుల్లో సైకిల్‌పై కనిపించి షాక్ ఇచ్చారు. ఎలక్ట్రీక్ సైకిల్ నడుపుకుంటూ.. ముంబయ్ వీధుల్లో తెగతిరిగారు. బాంద్రా నుంచి పాలీ హిల్స్‌ కు సైకిల్ మీద వచ్చారు రణ్ బీర్. పాలీ హీల్స్ తో తమ కలల సౌధం.. సొంత ఇంటి నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ  కొత్త ఇంటి నిర్మాణ పనులను పరిశీలించడానికి ఈ-బైక్‌పై వచ్చిన రణ్‌బీర్.. తిరిగి అక్కడి నుంచి ఈ-బైక్ పైనే సరదాగా రైడ్‌ చేస్తూ వెళ్లారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla

ఇక సెలబ్రిటీలను చూస్తు జనం ఆగుతారా.. ఆపటంసాద్యమయ్యేపనేనా...? రణ్‌బీర్‌ను చూసిన స్థానికులు ఫొటోలు తీసుకునేందుకు ఆయన వెంట పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వచ్చే ఏడాది తమ కొత్త ఇంటి గృహప్రవేశం గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నాడట రణ్ బీర్. ఇక రీసెంట్ గా బ్రహ్మాస్త్ర మూవీతో హిట్ కొట్టాడు ఈ యంగ్ హీరో. తనతో పాటు తన భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ సినిమాలో రణ్ బీర్ సరసన సందడి చేసింది. 

రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ 14న కొద్దిమంది ఫ్యామిలీ సభ్యులు, కొద్ది మంది ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే. పెళ్లైన రెండు నెలలకే 3 నెల ప్రెగ్నెస్సీ అంటూ.. షాక్ ఇచ్చింది ఈ జంట. ఆలియా తన ప్రెగ్నెన్సీని స్వయంగా  వెల్లడించింది. ఇక నవంబర్‌ 6న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కాగా రణ్‌బీర్‌, అలియా జంటగా నటించిన బ్రహ్మస్త్ర ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.430 కోట్ల కలెక్షన్‌లను సాధించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్‌  మూవీలో నటిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios