ముంబై మహానగరాన్ని ఇటీవల అకాల వర్షం, ఈదురు గాలులు కుదిపేశాయి. ఈదురు గాలుల వల్ల భారీ హోర్డింగ్ కుప్ప కూలి విషాదాన్ని మిగిల్చింది. 

ముంబై మహానగరాన్ని ఇటీవల అకాల వర్షం, ఈదురు గాలులు కుదిపేశాయి. ఈదురు గాలుల వల్ల భారీ హోర్డింగ్ కుప్ప కూలి విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 

ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతంలో 250 టన్నుల బరువున్న హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. దాని కింద 100 మంది వరకు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో కొంతమంది అత్యంత విషాదకరంగా మరణించారు. మరణించిన వారిలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 

కార్తీక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ ఛాన్సొరియా(60). ఆంటీ అనిత (58) ఈ ప్రమాదంలో మరణించారు. కార్తీక్ ఆర్యన్ వారి అంత్యక్రియలకు హాజరు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదంతో కార్తీక్ ఆర్యన్ కుటుంబ సభ్యులంతా శోక సంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకుంటున్నాడు. జూన్ 14న కార్తీక్ ఆర్యన్ తన కొత్త చిత్రం చందు ఛాంపియన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.