బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి.. అక్కడ సందడి చేస్తోంది.. స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తాజాగా ప్రియాంకాపై ప్రశంసల జల్లు కురిపించాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఇంతకీ విషయం ఏంటీ అంటే..?
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి.. అక్కడ సందడి చేస్తోంది.. స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తాజాగా ప్రియాంకాపై ప్రశంసల జల్లు కురిపించాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఇంతకీ విషయం ఏంటీ అంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు హృతిక్ రోషన్.. తన హీరోయిన్ ప్రియాంక చోప్రాని పొగడ్తలతో ముంచెత్తారు. తెగ పొగిడేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ సెండ్ చేశాడు. ఆమె నటనను పొగుడుతూ తాను పెట్టిన పోస్ట్ గురించి.. తెలుసుకున్న ప్రియాంక ఉప్పొంగిపోయింది. ఇక రీసెంట్ గా ప్రియాంక సిటాడెల్ అనే అమెరికన్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ గా వస్తున్న మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించి వరల్డ్ టాప్ వెబ్ సిరీస్ గా నిలిచింది.
ఇక తాజాగా ఈ సిరీస్ లో ని ఎపిసోడ్స్ ను చూశారు హృతిక్ రోషన్.. చూడటమే కాదు. వెబ్ మూవీస్ పై తన మార్క్ లో రివ్యూ కూడా ఇచ్చాడు. సిటాడెల్ బాగా నచ్చడంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రియాంక అండ్ మేకర్స్ ని అభినందించాడు హుతిక్ రోషన్. ప్రత్యేకంగ పోస్ట్ కూడా పెట్టాడు. ప్రియాంక సిటాడెల్ చూశాను. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మీ అద్భుతమైన వర్క్ చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. ప్రియాంక ఈసారి నువ్వు అదరగొట్టేశావ్. చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే.. అంటూ అలా పోస్ట్ పెట్డంతో..ఇక ప్రియాంక మాత్రం రెస్పాండ్ అవుతూ.. థాంక్స్ మై ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చింది.
ఇక వీరిద్దరిమధ్య స్నేహం క్రిష్ సూపర్ సిరీస్ ద్వారా ఏర్పడింది. అప్పటి నుంచి వీరు కలిసి నటించారు. ఒకరి నటన అంటే మరొకరికి ఇష్టం. క్రిష్ సిరీస్ లో..క్రిష్ 4 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్తుందనిసమాచారం. ఈమూవీని హృతిక్ అగ్నిపథ్ వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన కరణ్ మల్హోత్రా క్రిష్ 4 ని డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ఇక క్రిష్ 4 సీక్వెల్ లో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందా..? ఏదా.? చూడాలి మరి.
