బాలీవుడ్ హాట్ బ్యూటీ , ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తరువాత తన కామెంట్స్ తో మహారాష్ట్ర పాలిటిక్స్ లో వణుకు పుట్టించిన కంగనా ప్రస్తుతం ఒక షూటింగ్ నిమిత్తం నగరానికి వచ్చారు. 

జ‌య‌లలిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవా చిత్ర షూటింగ్ కోసం కంగ‌నా హైద‌రాబాద్‌కు వచ్చారు. ప‌ది రోజుల పాటు ఆమె ఇక్క‌డే ఉండనున్నారు. రామోజీ ఫిలిం సిటీలో జ‌ర‌గ‌నున్న ఈ చిత్ర షూటింగ్‌లో కంగ‌నా పాల్గొంటారు. అయితే కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నందున టూర్‌ వివరాలను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచారు. ఆమెకు పూర్తి స్థాయి భ‌ద్ర‌త క‌ల్పించిన‌ట్టుగా స‌మాచారం.

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ సూసైడ్ తరువాత తన మాటల తూటాలతో సెల‌బ్రిటీల‌నే కాదు ముంబై పోలీసులు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లతో కడిగేశారు. ముంబైని పీవోకే అన‌డంతో అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారు.

మ‌హారాష్ట్ర‌ని అవ‌మానించే వారు ముంబైకి రావొద్ద‌ని శివ‌సేన అన‌డంతో, ఆమె త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. వెంట‌నే స్పందించిన కేంద్రం కంగ‌నాకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. అనంత‌రం భ‌ద్ర‌త మ‌ధ్య ముంబైలో అడుగుపెట్టిన కంగ‌నా వారం త‌ర్వాత తిరిగి తన సొంత ఊరు మ‌నాలికి తన మకాంను మార్చారు.