బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్,  నిర్మాత కమల్ ఆర్ ఖాన్ అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర హక్కులకు మించి అల్లు అర్జు పుష్ప 2 కోసం డిమాండ్ చేస్తున్నారని కామెంట్ చేశారు.  

పుష్ప మూవీ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా హీరోల జాబితాలో చేర్చింది. వరల్డ్ వైడ్ ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూ. 360 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అనూహ్య పరిణామం. ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూసి అక్కడ డిజాస్టర్ అవుతుందనుకుంటే భారీ లాభాలు పంచింది. పుష్ప కి విశేష ఆదరణ దక్కిన నేపథ్యంలో పుష్ప 2 భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. మూడు వందల కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. 

కాగా పుష్ప 2 అన్ని భాషల రైట్స్ కి అల్లు అర్జున్ రూ. 1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాలీవుడ్ వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ రైట్స్ కేవలం రూ. 750 కోట్లకు అమ్ముడైన నేపథ్యంలో వెయ్యి కోట్లు డిమాండ్ చేయడం ద్వారా రాజమౌళి చిత్రం కంటే పుష్ప 2 బెటర్ మూవీ అని ఆయన భావిస్తున్నారని ఎద్దేవా చేశాడు. కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ వైరల్ గా మారింది. 

నిజంగా పుష్ప 2 మేకర్స్ ఆ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారా అంటే స్పష్టమైన సమాచారం లేదు. అయితే వారి టార్గెట్ వెయ్యికోట్ల వసూళ్లు అనే ప్రచారం జరుగుతుంది. మరి హక్కుల కోసమే అంత మొత్తంలో డిమాండ్ చేస్తే వసూళ్ళు అంచనాలు ఇంకా భారీగా ఉండాలి. 

Scroll to load tweet…

పుష్ప 2 ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది. యూనిట్ రెగ్యులర్ షూట్ జరుపుతున్నారు. అనుకున్న సమయం కంటే పుష్ప 2 చాలా ఆలస్యమైంది. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేయడం వలెనే... షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా చేస్తున్నారు. పార్ట్ 1లో లేని కొత్త నటులు సీక్వెల్ లో సర్ప్రైజ్ చేయనున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్ గా కనిపిస్తున్నారు. పుష్ప 2 లో ఊహించని ట్విస్ట్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. అలాగే హీరోయిన్ రష్మిక మందాన పాత్ర నిడివి తగ్గించేశారట. జగపతిబాబు కీలక రోల్ చేస్తున్నారని వినికిడి.