బాలీవుడ్ సీనియర్ నటి సుష్మితా సేన్, మోడల్ రోహ్మాన్ షాల్ గతేడాది తమ లవ్ ట్రాక్ కు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఏడాది తర్వాత తొలిసారి వీరిద్దరూ కలవడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల కాలంలో సెలబ్రేటీ లవ్ బర్డ్ ఎందుకు విడిపోతున్నారో.. ఎందుకు కలుస్తున్నారో పెద్ద మిస్టరీగా మారిపోయింది. అయితే క్షణికావేశంలో విడిపోయినా మళ్లీ కలవాలనే కోరిక వారిలో బలంగానే ఉంటుందని తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ మాజీ లవ్ బర్ట్స్ విషయంలో ఇది రుజువైంది. బాలీవుడ్ యాక్ట్రెస్ సుష్మితా సేన్ (Sushmita Sen) 1996 నుంచి హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. ఆరోగ్య సమస్యల రీతా 2015 తర్వాత చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటోంది.
అయితే, గతేడాది తన మాజీ లవర్, మోడల్ రోహ్మాన్ షాల్ తో బ్రేక్ అప్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ 2018 నుంచి గతేడాది వరకు రిలేషన్ లోనే ఉన్నారు. కానీ వ్యక్తిగత కారనాల వల్ల తమ జీవితాల్లో స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నట్టు సుష్మితా సేన్ ఒక పోస్ట్ పెట్టింది. ఈ న్యూస్ అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కాగా ఏడాది కూడా పూర్తి కాకుండానే వీరిద్దరూ తొలిసారిగా కలవడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మ్యారేజ్ కు దూరంగా ఉన్న సేన్ 12 ఏండ్ల కిందనే రెనీ అనే ఆడపిల్లని దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2010లో అలీసా అనే రెండో అమ్మాయిని దత్తత తీసుకుని పోషిస్తోంది. అయితే సేన్‌కు అడిసన్స్ అనే వ్యాధి ఉండటంతో అనారోగ్యాన్ని తగ్గించుకునేందుకు జీవితకాల స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగానే రోహ్మాన్ కు బ్రేక్ చెప్పిందనే అంశంపైనా చర్చనడిసింది. అయితే ఈ లవ్ బడ్స్ బ్రేక్ అప్ చెప్పుకున్నాకా కూడా ఓ హోటల్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సుస్మితా సేన్ సోమవారం సాయంత్రం ముంబైలోని తన మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్‌ను కలిసింది. సేన్ వెంట తన దత్త పుత్రిక అలిసా కూడా ఉంది. సుస్మితా సేన్, రోహ్మాన్ షాల్ చాలా రోజుల తర్వాత కలడంతో ఒకే రకమైన దుస్తులను ధరించడం గమనార్హం. ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి వస్తుండగా పలువురు చిత్రీకరించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. సెల్ఫీల కోసం సుష్మితా సేన్ వద్దకు పలువురు అభిమానులు రావడంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వెంటనే రోహ్మాన్ వారందరినీ నివారించి అక్కడి నుంచి సేన్, అలిసాను తీసుకెళ్లారు. దీంతో రోహ్మాన్ కు ఇంకా సుష్మితా సేన్ పై ప్రత్యేక అభిమానం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.
