వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తైయింది.


కొత్త కాంబినేషన్స్ ఎప్పుడూ వర్కవుట్ అవుతూంటాయి. ఈ విషయం తెలిసిన డైరక్టర్స్ తమ సినిమాలను ఆ యాంగిల్ లోనే చూస్తూ ప్రాజెక్టులు సెట్ చేస్తూంటారు. తాజాగా అనీల్ రావిపూడి సైతం బాలయ్యతో తను చేస్తున్న సినిమాని నెక్ట్స్ లెవిల్ లో చూస్తున్నారు. ఈ సినిమా కోసం భారీగా శ్రమిస్తున్నారు. సినిమాని ఓ కొత్త రకంగా ప్రెజెంట్ చేయాలని రాత్రింబవళ్లూ కలలు కంటూ స్రిప్టుని షార్ప్ చేస్తూ అందుకు తగ్గ నటీనటులను ప్రాజెక్టులోకి తీసుకువస్తున్నారు. 

కామెడీ, ఫ్యామిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ బాలయ్యతో తన మార్కు కామెడీకి తోడు మాస్ సినిమాను ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య తన వయసుకు తగ్గట్టుగా తండ్రి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రంలో బాలయ్యతో ఢీ కొట్టే విలన్‌గా బాలీవుడ్‌ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. గతంలో నోరా ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో నర్తించింది. అనిల్ చెప్పిన కథకు నోరా అంగీకరించినట్టు తెలుస్తోంది. నోరా పాత్ర నెగటివ్ షేడ్స్ తో కూడి పవర్ ఫుల్ గా ఉంటుందట. 

మరో ప్రక్క ఫామ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ శ్రీలీల...బాలయ్య కూతురు పాత్రను పోషించనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లి దసరా కానుకగా విడుదల చేయాలని అనిల్ భావిస్తున్నాడు. తారకరత్న మరణంతో ఆ షెడ్యూల్ కాన్సిల్ అయింది.

 తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నెల 9న నుంచి శ్రీలీలపై కొన్ని కీలక సన్నివేశాలతో ప్రారంభించనున్నారు. బాలయ్య ఒక వారం తర్వాత జాయిన్ కానున్నారు. ఈ షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. . ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో రానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. నిప్పురవ్వ తర్వాత బాలయ్య చేస్తున్న పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే కథ.