బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ లో రాధికా  ఆప్టే కూడా ఒకరు. ఆమె చేసే సినిమాలు, సిరీస్ లతో పాటు.. కామెంట్స్ కూడా కాస్త బోల్డ్ గానే ఉంటాయి. ఇత తాజాగా ఓసినిమా గురించి మాట్టాడింది రాధిక.. ఏమంటుందంటే..? 

చాలా డిఫరెంట్ గా సినిమా చేస్తుంది రాధికా ఆప్టే. ముఖ్యంగా అడల్ట్ సీన్స్ ను ఏమాత్రం మొహమాటం లేకుండా చేయడంతో.. బాలీవుడ్ లో ఆమెను మించినవారు లేరు. రాధిక ఆప్టే సాటి హీరోయిన్లతో పోలిస్తే ఆమెది పెక్యులర్‌ కెరీర్‌. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీషోలు.. ఇలా ఏదైనా సరే నచ్చితే చేసస్తుంది. నచ్చకపోతే..ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే వదిలేస్తుంది. అదే రాధిక ప్రత్యేకతరీసెంట్‌గా రాధిక ఓసినిమా కోసం గెస్ట్ రోల్ చేసింది. కత్రినాకైఫ్‌ హీరోయిన్ గా నటించిన సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది బ్యూటీ. అయితే సినిమాలో తన పాత్ర గురించి విరంచింది రాధిక. 

పూర్తి వివరాల్లోకెళ్తే- విజయ్‌ సేతుపతి, కత్రినాకైఫ్‌ లీడ్ రోల్స్ చేసిని సినిమా మేరీ క్రిస్మస్. శ్రీరాం రాఘవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రాధికా ఆప్టే అతిథిగా నటించింది. అతిథి అంటే సినిమాలో ఓ అయిదారు సన్నివేశాలు ఉంటాయి అనుకంటారంతా.. కాని ఇందులో ఆమెది కేవలం ఒకేఒక్క సన్నివేశంలో ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ ఇంత చిన్న పాత్ర ఒప్పుకోడానికి కారణం కేవలం దర్శకుడు. తను నాకు మంచి ఫ్రెండ్‌. అని అన్నారు. 

అంతేకాదు. తను తీసిన ప్రతి సినిమాలోనూ నేనున్నా. ఆ సెంటిమెంట్‌ని మిస్‌ చేయకూడదనే నటించా. చేసింది ఒక్క సన్నివేశమే అయినా.. షూటింగ్‌ మాత్రం రెండు రాత్రుళ్లు పాల్గొనాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.అటు కీర్తి సురేష్ తో కలిసి రాధికా ఆప్టే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ‘అక్క’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియడ్ థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తి అయిన తర్వాతే అఫీషియల్ ప్రకటనలు చేయాలి అనుకుంటున్నారట మేకర్స్.